Gachibowli Building Collapse: హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన భవన ప్రమాదం స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురిచేసింది. అంజయ్యనగర్( Anjaiah Nagar)లో నాలా పక్కనే సుమారు 50 గజాల స్థలంలో నిర్మించిన ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. నిర్మాణం పూర్తయి అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం కలకలం రేపింది. భవనం కూలిన ఘటనలో శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. శిథిలాల కింద మరెవరైనా చిక్కుకుని ఉన్నారా అనే అనుమానంతో సహాయక చర్యలను కొనసాగించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
భవనం కూలిన సమయంలో శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై పడటంతో దాని గోడలు దెబ్బతిన్నాయి. సమీపంలోని హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులు ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు. భారీ శబ్దంతో పరిసర ప్రాంతాల్లో కలకలం నెలకొంది. భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించారా? అనుమతులు, నిర్మాణ నిబంధనలు ఉల్లంఘించారా? నాలా పక్కనే నిర్మాణం చేపట్టడం ప్రమాదానికి కారణమైందా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణాలు అధికారిక విచారణ పూర్తయిన తర్వాత స్పష్టమయ్యే అవకాశం ఉంది. సాయంత్రం వేళ ఇదే ఘటన జరిగి ఉంటే మరింత ప్రాణనష్టం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: Paris Hindu Temple | పారిస్లో హిందూ ధర్మ వైభవం.. సెప్టెంబర్లో స్వామినారాయణ్ మందిరం ప్రారంభం!
