LIVE
Sunday, November 15, 2026
LIVE
LIVE

Fly91 Airlines | శంషాబాద్‌లో ఫ్లై91 విమానానికి అత్యవసర ల్యాండింగ్

by Bajaswamy
5 views
Fly91 flight makes emergency landing at Hyderabad airport after a technical issue.

Fly91 Airlines: విజయవాడకు వెళ్లాల్సిన ఓ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యను ఎదుర్కొంది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad airport)లో విమానాన్ని అత్యవసరంగా తిరిగి ల్యాండ్(Emergency Landing) చేశారు.శంషాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరిన ఫ్లై91 ఎయిర్‌లైన్స్ విమానంలో టేకాఫ్ అనంతరం సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించారు. వెంటనే పరిస్థితిని ఏటీసీ అధికారులకు తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది అత్యవసర ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపటికే విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తీసుకొచ్చి సురక్షితంగా దించారు.

విమానంలో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు తదుపరి ఏర్పాట్లు చేపట్టారు. వారిని ప్రత్యామ్నాయ విమానంలో విజయవాడకు పంపేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పైలట్ సమయస్ఫూర్తితో స్పందించడం, ఏటీసీకి వెంటనే సమాచారం అందించడం వల్ల పరిస్థితిని సురక్షితంగా అదుపులోకి తీసుకురాగలిగారు. ఘటనపై సంబంధిత అధికారులు సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్నారు.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More