Home Telangana CM Revanth Reddy | ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. రాజ్‌నాథ్ సింగ్‌కు కృతజ్ఞతలు

CM Revanth Reddy | ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. రాజ్‌నాథ్ సింగ్‌కు కృతజ్ఞతలు

0
CM Revanth Reddy | ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. రాజ్‌నాథ్ సింగ్‌కు కృతజ్ఞతలు
CM Revanth Reddy during his meeting with Defence Minister Rajnath Singh in New Delhi.

CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన కేంద్ర మంత్రుల భేటీల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో నేడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ భేటీలో గాంధీ సరోవర్ అభివృద్ధి కోసం రక్షణ శాఖ భూములు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో అవసరమైన రక్షణ శాఖ భూముల బదలాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై కూడా ఇద్దరు నేతల మధ్య చర్చలు జరిగాయి. మొత్తం మీద ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంతో సమన్వయం పెంపొందించడంతో పాటు రాష్ట్ర సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు.