Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeSports2028 Los Angeles Olympics | టీ20 ప్రపంచకప్‌లో నిరాశ.. ఒలింపిక్స్‌కు అర్హతతో భారత మహిళల...

2028 Los Angeles Olympics | టీ20 ప్రపంచకప్‌లో నిరాశ.. ఒలింపిక్స్‌కు అర్హతతో భారత మహిళల జట్టుకు ఊరట

-

Chat on WhatsApp

2028 Los Angeles Olympics: టీ20 ప్రపంచకప్‌ 2026లో ఆశించిన స్థాయిలో రాణించలేక గ్రూప్ దశలోనే టోర్నీకి వీడ్కోలు పలికిన భారత మహిళల క్రికెట్ జట్టుకు ఇప్పుడు ఒక శుభవార్త లభించింది. ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరుకోలేక అభిమానులను నిరాశపరిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని జట్టు, 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హతను అధికారికంగా దక్కించుకుంది.

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) ప్రకటించిన అర్హత ప్రమాణాల ప్రకారం, ప్రస్తుత మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాల్గొన్న ఆసియా జట్లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్టుగా భారత్ నిలిచింది. దీంతో ఒలింపిక్స్‌లో చోటు ఖాయం అయింది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మహిళల జట్లు కూడా లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. మరో రెండు స్థానాల కోసం మిగిలిన జట్లు పోటీపడనున్నాయి. మొత్తం ఆరు జట్లతో మహిళల క్రికెట్ టోర్నీ నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఒలింపిక్ చరిత్రలో క్రికెట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. చివరిసారిగా 1900 పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రమే ఈ క్రీడకు అవకాశం లభించింది. ఆ తర్వాత దాదాపు 128 సంవత్సరాల విరామం అనంతరం 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ ద్వారా క్రికెట్ మళ్లీ ఒలింపిక్ వేదికపైకి అడుగుపెట్టనుంది. ప్రపంచకప్‌లో ఆశించిన ఫలితం రాకపోయినా, ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం మహిళల క్రికెట్‌కు కొత్త ఉత్సాహాన్ని అందిస్తుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp