LIVE
Sunday, November 15, 2026
LIVE
LIVE

Yashasvi Jaiswal | 29 టెస్టులు.. 29 స్టేడియాలు.. జైస్వాల్ పేరిట అరుదైన రికార్డు

by Bajaswamy
16 views
Yashasvi Jaiswal celebrates a milestone as he nears 30 Tests at 30 different stadiums.

Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ మరో అరుదైన ఘనతకు చేరువయ్యాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో చాలా అరుదుగా కనిపించే రికార్డుతో వార్తల్లో నిలిచాడు. ఇప్పటివరకు అతడు ఆడిన ప్రతి టెస్టు మ్యాచ్ వేర్వేరు స్టేడియంలో జరగడం విశేషం. 2023లో వెస్టిండీస్‌పై టెస్టు అరంగేట్రం చేసిన జైస్వాల్ ఇప్పటివరకు 29 టెస్టులు ఆడగా, ఆ 29 మ్యాచ్‌లు 29 భిన్నమైన వేదికల్లో జరిగాయి. ఒక్కసారి కూడా ఒకే స్టేడియంలో రెండో టెస్టు ఆడాల్సిన పరిస్థితి రాలేదు. ఇప్పుడు శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి గాల్‌లో జరిగే తొలి టెస్టు అతడి కెరీర్‌లో 30వ మ్యాచ్ కానుంది. గాల్‌లో కూడా ఇదే తొలి టెస్టు కావడంతో వరుసగా 30 టెస్టులు – 30 వేర్వేరు స్టేడియాలు అనే అరుదైన ఘనతను అందుకోనున్నాడు.

29 టెస్టుల్లో 54 ఇన్నింగ్స్‌లు ఆడిన జైస్వాల్ 48.75 సగటుతో 2,535 పరుగులు చేశాడు. ఇప్పటివరకు  ఇందులో 7 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు సాధించాడు. అత్యధిక స్కోరు 214 పరుగులు కాగా, రెండు ద్విశతకాలు కూడా నమోదు చేశాడు. 66.11 స్ట్రైక్‌రేట్‌తో దూకుడైన బ్యాటింగ్‌కు పేరుగాంచిన అతడు 317 ఫోర్లు, 45 సిక్సర్లు బాదాడు. టెస్టుల్లో క్రమంగా భారత జట్టు రెగ్యులర్ ఓపెనర్‌గా నిలిచిన జైస్వాల్, గాల్ టెస్టుతో మరో చారిత్రక మైలురాయిని అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More