Friday, August 7, 2026
Chat on WhatsApp
HomeSportsFIFA World Cup 2026 | రొనాల్డోకు చేదు అనుభవం.. ఒక్క షాట్ కూడా గోల్‌కు...

FIFA World Cup 2026 | రొనాల్డోకు చేదు అనుభవం.. ఒక్క షాట్ కూడా గోల్‌కు వెళ్లని మ్యాచ్

-

Chat on WhatsApp

FIFA World Cup 2026: పోర్చుగల్ స్టార్ స్ట్రైకర్ క్రిస్టియానో రొనాల్డోకు ఫిఫా వరల్డ్ కప్–2026లో అంచనాలకు భిన్నమైన అనుభవం ఎదురైంది. గ్రూప్–కే తొలి మ్యాచ్‌లో బలహీన జట్టుగా భావించిన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DR Congo)తో పోర్చుగల్ 1-1తో డ్రా చేసుకోవడం ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. హ్యూస్టన్‌లోని NRG స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ ఆరంభంలోనే ఆధిక్యం సాధించింది.

6వ నిమిషంలో జోనో నెవ్స్ గోల్ చేయడంతో జట్టు శుభారంభం చేసింది. అయితే మొదటి అర్ధభాగం ముగిసే సమయానికి కాంగో ఆటగాడు యోవానే విస్సా అద్భుత గోల్‌తో స్కోరును సమం చేశాడు. ఈ గోల్ డీఆర్ కాంగో వరల్డ్ కప్ చరిత్రలో తొలి గోల్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో రొనాల్డో 41 ఏళ్ల వయసులో వరల్డ్ కప్‌లో స్టార్టింగ్ లైనప్‌లో నిలిచిన అత్యంత వయస్కుడైన ఔట్‌ఫీల్డ్ ఆటగాడిగా రికార్డు సృష్టించినప్పటికీ, అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు.

మొత్తం మ్యాచ్‌లో 25 సార్లు మాత్రమే బంతిని తాకిన రొనాల్డో గోల్ పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకుని ఒక్క షాట్ కూడా కొట్టలేకపోయాడు. రెండో అర్ధభాగంలో వచ్చిన రెండు కీలక అవకాశాలను కూడా వినియోగించుకోలేకపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత డీఆర్ కాంగో అభిమానులు ‘మెస్సీ.. మెస్సీ..’ అంటూ నినాదాలు చేస్తూ రొనాల్డోను ట్రోల్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అంతకుముందు రోజు మెస్సీ అర్జెంటీనా తరఫున హాట్రిక్ సాధించడం కూడా ఈ ట్రోలింగ్‌కు కారణమైంది. అయినప్పటికీ రొనాల్డో శాంతంగా స్పందిస్తూ నవ్వుతూ మైదానం వీడటం కనిపించింది. తర్వాత సోషల్ మీడియాలో స్పందించిన రొనాల్డో, ఇది తమకు అనుకున్న ఆరంభం కాదని, కానీ టోర్నమెంట్ ఇంకా కొనసాగుతుందని తెలిపారు. తల ఎత్తుకుని తదుపరి మ్యాచ్‌లపై దృష్టి పెడతామని ఆయన పేర్కొన్నారు. పోర్చుగల్ కోచ్ రాబర్టో మార్టినెజ్ కూడా రొనాల్డోకు మద్దతుగా నిలుస్తూ కీలక మ్యాచ్‌లో అతడిని బెంచ్‌లో ఉంచడం సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

UPI digital payment | UPI వినియోగదారులకు అలర్ట్.. కేంద్రం కొత్త నిర్ణయం ఇదే!

UPI digital payment: దేశంలో డిజిటల్ చెల్లింపులకు వెన్నెముకగా మారిన యూపీఐ (UPI) వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007 సవరణ బిల్లుకు...
- Advertisement -
Chat on WhatsApp