Thursday, August 6, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshAP Cabinet Decisions | ఒక్క కేబినెట్.. ఎన్నో నిర్ణయాలు! అమరావతి, పుష్కరాలు, కొత్త చట్టాలపై గ్రీన్...

AP Cabinet Decisions | ఒక్క కేబినెట్.. ఎన్నో నిర్ణయాలు! అమరావతి, పుష్కరాలు, కొత్త చట్టాలపై గ్రీన్ సిగ్నల్

-

Chat on WhatsApp

AP Cabinet Decisions: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల విస్తరణకు దిశానిర్దేశం చేసే పలు కీలక నిర్ణయాలను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన సమావేశంలో వ్యాపార అనుకూల విధానాలు, కొత్త చట్టాలు, పర్యాటక ప్రాజెక్టులు, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి కొలుసు పార్థసారథి వివరాల ప్రకారం, Ease of Doing Business Act-2026, PPP Policy-2026 ముసాయిదాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దిశా బిల్లు-2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు-2024లను ఉపసంహరించి, వాటి స్థానంలో మరింత సమర్థవంతమైన చట్టాలను తీసుకురావాలని నిర్ణయించింది.

అలాగే అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పునర్‌వ్యవస్థీకరణ, పాదచారుల భద్రత పాలసీ-2026కు కూడా ఆమోదం లభించింది. అమరావతిలో ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా ‘అమరావతి ఐ’ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని, దానికి అనుబంధంగా గ్రీన్ పార్కుల కోసం భూ కేటాయింపులకు అనుమతి ఇచ్చింది. రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం రూ.210 కోట్ల విడుదలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

సమావేశం అనంతరం మంత్రులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, డీఎస్సీ నియామకాలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పికొట్టాలని సూచించారు. రిజర్వేషన్లపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాలని కోరారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

UPI digital payment | UPI వినియోగదారులకు అలర్ట్.. కేంద్రం కొత్త నిర్ణయం ఇదే!

UPI digital payment: దేశంలో డిజిటల్ చెల్లింపులకు వెన్నెముకగా మారిన యూపీఐ (UPI) వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007 సవరణ బిల్లుకు...
- Advertisement -
Chat on WhatsApp