Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTTrisha | రూమర్లకు ఫుల్‌స్టాప్.. త్రిష ఒక్క పోస్టుతో క్లారిటీ

Trisha | రూమర్లకు ఫుల్‌స్టాప్.. త్రిష ఒక్క పోస్టుతో క్లారిటీ

-

Chat on WhatsApp

Trisha: నటి త్రిష గురించి సోషల్ మీడియాలో తిరుగుతున్న పెళ్లి, సినిమాలకు గుడ్‌బై, రాజకీయాల్లోకి ఎంట్రీ వంటి ఊహాగానాలకు ఆమె ఒక్క ఇన్‌స్టాగ్రామ్ స్టోరీతోనే బలమైన కౌంటర్ ఇచ్చారు. “అవును… నేను సినిమాలు మానేశాను.

ఓ పెద్ద వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని నలుగురు పిల్లలను కూడా కనేశాను. మీ ఊహాగానాలకు ఇది సరిపోతుందా?” అంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఈ పోస్టుతో ఆమెపై గత కొద్ది రోజులుగా నడుస్తున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడింది.

త్రిష స్పందన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అభిమానులు కూడా ఆమె స్టైల్‌కు ఫిదా అవుతున్నారు. సినీ వర్గాల్లోనూ ఈ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ మొత్తం వివాదానికి కారణం నటుడు చిత్రా లక్ష్మణన్ చేసిన వ్యాఖ్యలే. ఓ ఇంటర్వ్యూలో త్రిష ఇక సినిమాలు చేయాలని అనుకోవడం లేదని, వస్తున్న అవకాశాలను కూడా వదులుకుంటోందని ఆయన చెప్పడంతో వార్తలు వేగంగా వ్యాపించాయి.

అదే సమయంలో, టీవీకే అధినేత విజయ్తో త్రిష రిలేషన్‌లో ఉన్నారనే ప్రచారం కూడా మళ్లీ ఊపందుకుంది. దీంతో పెళ్లి, రాజకీయాలు, సినీ విరామం అంటూ ఎన్నో రూమర్లు ఒక్కసారిగా ట్రెండ్ అయ్యాయి. అయితే ఈ ఊహాగానాలన్నింటికీ త్రిష తనదైన సెటైరిక్ స్టైల్‌లో చెక్ పెట్టారు.

అసలు విషయం ఏమిటంటే, త్రిష ఇప్పటికీ సినిమాల్లో బిజీగానే ఉన్నారు. ప్రస్తుతం ఆమె కరుపు(తెలుగులో వీరభద్రుడు)లో నటిస్తున్నారు. అలాగే విశ్వంభర(Vishwambhara) సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు.

దీంతో “త్రిష సినిమాలు మానేస్తున్నారు” అన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టమైంది. మొత్తానికి, ఒక్క వ్యంగ్య పోస్టుతోనే త్రిష అన్ని రూమర్లకు ఒకేసారి సమాధానం ఇచ్చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

telangana chief minister revanth reddy predicts 2029 assembly elections

CM Revanth Reddy | వచ్చే ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాల్లో 117 కాంగ్రెస్‌వే.....

CM Revanth Reddy: ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్, కాంగ్రెస్ భవిష్యత్తు, బీఆర్‌ఎస్‌పై తన రాజకీయ అంచనాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన...
- Advertisement -
Chat on WhatsApp