Wednesday, July 29, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTPavala Shyamala | టాలీవుడ్‌లో విషాదం.. నవ్వులు పంచిన నటి.. పావలా శ్యామల ఇకలేరు

Pavala Shyamala | టాలీవుడ్‌లో విషాదం.. నవ్వులు పంచిన నటి.. పావలా శ్యామల ఇకలేరు

-

Chat on WhatsApp

తెలుగు సినీ పరిశ్రమ మరో సీనియర్ నటిని కోల్పోయింది. ఎన్నో చిత్రాల్లో తన సహజ నటన, హాస్యభరిత పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల(Pavala Shyamala passed away) మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాత్రి 1:52 గంటలకు గుండెపోటు రావడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పావలా శ్యామల మృతితో సినీ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె భౌతికకాయాన్ని ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో ఉంచారు.

గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగించిన ఆమె పరిస్థితి పలువురిని కలిచివేసింది. ఆమెతో పాటు ఉంటున్న కుమార్తె కూడా అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు వందలాది చిత్రాల్లో సహాయ, హాస్య పాత్రల ద్వారా ప్రేక్షకులను అలరించిన పావలా శ్యామల చివరి రోజులు కష్టాలతోనే గడవడం సినీ వర్గాలను విషాదంలో ముంచింది.

ఆమె మరణవార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, సహచర నటీనటులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. తెలుగు చిత్రసీమకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

UN Security Council | భారతీయుల రక్షణే లక్ష్యం.. ఐరాసలో భారత్ సంచలన వ్యాఖ్యలు

UN Security Council: పశ్చిమాసియాలో నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని భారత్ స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధి పరిధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న...
- Advertisement -
Chat on WhatsApp