Tuesday, July 28, 2026
Chat on WhatsApp
HomeBusinessGold Prices | బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు చూస్తే షాక్ అవుతారు!

Gold Prices | బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు చూస్తే షాక్ అవుతారు!

-

Chat on WhatsApp

Gold Prices: కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. నిన్న తులం బంగారం ధర రూ.930 వరకు పెరగగా, నేడు కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు తాజా ధరలను పరిశీలిస్తున్నారు. జూలై 28 నాటికి హైదరాబాద్, విజయవాడ, చెన్నై నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,910గా, 22 క్యారెట్ల బంగారం రూ.1,33,710గా నమోదైంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,46,050, 22 క్యారెట్లది రూ.1,33,860గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,45,870 కాగా, బెంగళూరులో రూ.1,45,590గా నమోదైంది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర మాత్రం రూ.2,39,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొనే పరిణామాలే బంగారం ధరలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. అమెరికా డాలర్ బలపడటం లేదా బలహీనపడటం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల ధోరణి వంటి అంశాల ఆధారంగా పసిడి ధరలు మారుతుంటాయి.

మరోవైపు జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు, రవాణా వ్యయాలు, స్థానిక పన్నుల కారణంగా నగరాలవారిగా స్వల్ప ధరల తేడాలు కనిపిస్తాయి. ఆభరణాలు కొనుగోలు చేసే ముందు జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు అదనంగా వర్తిస్తాయని గుర్తుంచుకుని, సమీప జ్యువెలరీ షోరూమ్‌లో తాజా ధరలను నిర్ధారించుకోవడం మంచిది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Shubman Gill and Ravindra Jadeja in India's Test squad announcement

Test Squad | శ్రీలంక టూర్‌కు టీమిండియా జట్టు ఖరారు.. జడేజా రీఎంట్రీ, యువ...

India vs Sri Lanka: శ్రీలంక పర్యటనకు సిద్ధమైన టీమిండియాలో అనుభవం, యువతకు సమాన ప్రాధాన్యం దక్కింది. శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి 15 మంది సభ్యులతో...
- Advertisement -
Chat on WhatsApp