LIVE
Thursday, November 12, 2026
LIVE
LIVE

Ponguleti Srinivas Reddy | ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి ఆగదు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

by Bajaswamy
9 views
Ponguleti Srinivas Reddy inaugurates development works in Mahabubabad district

Ponguleti Srinivas Reddy: రాష్ట్ర ఖజానాపై ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ప్రజలకు అందాల్సిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడంలో వెనక్కి తగ్గేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణను అన్ని రంగాల్లో ముందంజలో నిలపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. సహచర మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్యేలు మురళి నాయక్, కే.ఎల్. నాగరాజు, జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కేసముద్రంలో రూ.1.90 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం కేసముద్రం మండలంలో రూ.6 కోట్లతో చేపట్టనున్న మున్సిపాలిటీ భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. ఇనుగుర్తి, సీరోలు, దంతాలపల్లి మండలాల్లో రూ.2.25 కోట్ల చొప్పున నిర్మించనున్న నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాలకు కూడా శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా అభివృద్ధి పనులకు, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను మెరుగుపరుస్తూ తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More