Tuesday, June 30, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadGas delivery boy ganja case | గ్యాస్‌ డెలివరీ బాయ్‌ నుంచి గంజాయి డెలివరీ బాయ్ 

Gas delivery boy ganja case | గ్యాస్‌ డెలివరీ బాయ్‌ నుంచి గంజాయి డెలివరీ బాయ్ 

-

Chat on WhatsApp

HYDERABAD: కూకట్‌పల్లిలో గ్యాస్‌ డెలివరీ బాయ్‌(gas delivery boy)గా పనిచేస్తున్న గాదె అజయ్‌ (21) గంజాయి సరఫరా వ్యవహారంలో ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ అధికారుల దృష్టికి చిక్కాడు. ఇంటింటికీ సిలిండర్లు అందిస్తూ వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో అదనపు సంపాదన కోసం అక్రమంగా గంజాయి సరఫరా చేయడం మొదలుపెట్టాడు.

గంజాయి తీసుకునే వారు ఆర్డర్‌ ఇస్తే నేరుగా వారి ఇళ్లకే వెళ్లి అందజేస్తున్నాడు. ఇస్తావా హోమ్స్‌ ప్రాంతంలో గంజాయి విక్రయం జరుగుతుందన్న సమాచారం మేరకు ఎస్‌టీఎఫ్‌ సిబ్బంది నిఘా పెట్టి అజయ్‌ను పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 580 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసి, నిందితుడితో పాటు కూకట్‌పల్లి ఎక్సైజ్‌ స్టేషన్‌కు అప్పగించారు.

ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ALSO READ:Telangana junior kho kho tournament | పఠాన్ చెరు మైదానంలో 44వ తెలంగాణ జూనియర్ ఖో ఖో పోటీలు..

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

విశాఖలో ఘనంగా కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి కాన్వొకేషన్.. రాష్ట్రపతికి స్వాగతం పలికిన నారా...

తొలిసారిగా నిర్వహించిన స్నాతకోత్సవంతో విశాఖపట్నంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మరో మైలురాయిని చేరుకుంది. ఈ వేడుకకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి భారత...
- Advertisement -
Chat on WhatsApp