అఫ్గాన్–పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. తమ వైమానిక దాడుల్లో 274 మంది తాలిబన్లు మృతిచెందగా, 400 మందికి పైగా గాయపడ్డారని పాక్ ప్రకటించింది. మరోవైపు 55 మంది పాక్ సైనికులను హతమార్చామని అఫ్గాన్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే అధికారిక మరణాల లెక్కల్లో స్పష్టత లేక గందరగోళం నెలకొంది. పాక్ 12 మంది సైనికులే మరణించారని చెబుతుండగా, అఫ్గాన్ తమవారు 13 మందే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.
సరిహద్దుల్లో వైమానిక దాడులు
ఫిబ్రవరి 22న అఫ్గాన్ సరిహద్దుల్లో పాక్ వైమానిక దాడులు జరిపి 70 మంది ముష్కరులను హతమార్చినట్లు తెలిపింది. దీనికి ప్రతీకారంగా అఫ్గాన్ బలగాలు పాక్ చెక్పోస్టులపై దాడులు చేశాయి. కాబుల్, కాందహార్, పక్తియా ప్రాంతాల్లో కూడా వైమానిక దాడులు జరిగినట్లు సమాచారం.
అఫ్గాన్‌కు చెందిన 73 పోస్టులను ధ్వంసం చేసి, 18ను స్వాధీనం చేసుకున్నామని పాక్ పేర్కొంది. అఫ్గాన్ వర్గాలు మాత్రం రెండు కీలక కార్యాలయాలు, 19 చెక్‌పోస్టులను స్వాధీనం చేసుకున్నామని తెలిపాయి.
అంతర్జాతీయ ఆందోళన
పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బహిరంగ యుద్ధమేనని పేర్కొన్నారు. తాజా పరిస్థితులపై సౌదీ అరేబియా, తుర్కియే విదేశాంగ మంత్రులతో చర్చలు జరిపినట్లు పాక్ విదేశాంగ శాఖ తెలిపింది.
ఇదిలా ఉండగా China, Russia దేశాలు ఆందోళన వ్యక్తం చేసి, దౌత్య మార్గాల్లో పరిష్కారం కోరాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి.
ALSO READ:Narendra Modi launching HPV vaccination | దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా కార్యక్రమానికి శ్రీకారం








