Kakinada Explosion: కాకినాడ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెం పరిధిలో గోదావరి కెనాల్ సమీపంలో ఉన్న ‘సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్’ బాణసంచా తయారీ కేంద్రంలో మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది.
ఒక్కసారిగా సంభవించిన ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. పేలుడు తీవ్రతతో భారీ మంటలు ఎగసిపడగా, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది.
పేలుడు శబ్దం దాదాపు 5 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. పేలుడు తీవ్రతకు సమీప గ్రామంలోని ప్రైవేట్ పాఠశాల భవనం స్లాబ్‌లో చీలికలు కనిపించాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 8 మందిని అంబులెన్స్‌ల ద్వారా సమీప ఆస్పత్రులకు తరలించారు.
ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించారా? అనేది ప్రశ్నగా మారింది. అధికారులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దుర్ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.
ALSO READ:London Fire Accident | లండన్ అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు యువకులు మృ**తి





