Thursday, March 12, 2026
No menu items!
Home ENTERTAINMENT Vijay Deverakonda Wedding | పెళ్లి ఫోటోలతో విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన రష్మిక

Vijay Deverakonda Wedding | పెళ్లి ఫోటోలతో విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన రష్మిక

0
7
Rashmika Mandanna and Vijay Deverakonda wedding photo breaks Virat Kohli Instagram record
Rashmika Mandanna and Vijay Deverakonda wedding photo breaks Virat Kohli Instagram record

Vijay Deverakonda Wedding: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) సరికొత్త సోషల్ మీడియా చరిత్ర సృష్టించారు. ఫిబ్రవరి 26న హీరో విజయ్ దేవరకొండతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన అనంతరం తమ పెళ్లి ఫోటోలను ఇంస్టాగ్రామ్ (Instagram)లో పంచుకున్నారు.

ఈ పోస్టులకు నెటిజన్ల నుంచి అపూర్వ స్పందన లభించింది. కేవలం కొన్ని గంటల్లోనే ఆ ఫోటోలు 23 మిలియన్లకు పైగా లైకులు సాధించి రికార్డు సృష్టించాయి.

ఇప్పటివరకు అత్యధిక లైకులు పొందిన భారతీయ ఇన్‌స్టాగ్రామ్ పోస్టు రికార్డు భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరిట కొనసాగుతోంది.

2024 టీ20 వరల్డ్ కప్ విజయానంతరం జట్టుతో కలిసి ట్రోఫీ పట్టుకున్న ఫోటోను షేర్ చేయగా దానికి సుమారు 22 మిలియన్ల లైకులు వచ్చాయి. ఆసియాలో 20 మిలియన్ మార్కును దాటిన తొలి అథ్లెట్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించారు.

అయితే ఇప్పుడు రష్మిక-విజయ్ వివాహ ఫోటోలు ఆ రికార్డును అధిగమించాయి. పెళ్లి వేడుకలోని ప్రత్యేక క్షణాలను పంచుకున్న వెంటనే అభిమానులు భారీగా స్పందించారు. ఈ పరిణామంతో సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చర్చ మొదలైంది.

కోహ్లీ అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తుండగా, రష్మిక అభిమానులు ఈ విజయాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఇలా ఒక సినీ నటి పోస్టు క్రికెట్ స్టార్ రికార్డును దాటడం డిజిటల్ ప్రపంచంలో కొత్త మైలురాయిగా మారింది.

ALSO READ:AP High Court | న్యాయరంగంలో అరుదైన ఘట్టం.. ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజే నియామకం