Sunday, July 26, 2026
Chat on WhatsApp
HomeInterNationalTrump Anthropic Decision | ఆంథ్రోపిక్‌కు ట్రంప్ షాక్.. ఓపెన్‌ఏఐతో పెంటగాన్ ఒప్పందం

Trump Anthropic Decision | ఆంథ్రోపిక్‌కు ట్రంప్ షాక్.. ఓపెన్‌ఏఐతో పెంటగాన్ ఒప్పందం

-

Chat on WhatsApp

Trump Anthropic Decision: అమెరికా రాజకీయాల్లో ఏఐ సంస్థల చుట్టూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రక్షణశాఖ డిమాండ్లను తిరస్కరించిన ఆంథ్రోపిక్‌(Anthropic)తో ఇకపై వ్యాపారం చేయబోమని ప్రకటించారు.

ఆ సంస్థ టెక్నాలజీని ప్రభుత్వ ఏజెన్సీలు వెంటనే వినియోగం ఆపాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో పెంటగాన్‌తో OpenAI ఒప్పందం కుదుర్చుకోవడం చర్చనీయాంశమైంది.

అమెరికా రక్షణ కార్యాలయం Pentagon, ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన క్లాడ్ మోడళ్లకు సైన్యానికి అపరిమిత యాక్సెస్ ఇవ్వాలని కోరింది. నిర్ణీత గడువులో అంగీకరించాలంటూ ఒత్తిడి తెచ్చింది.

అయితే ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్‌(Dario Amodei), ఈ డిమాండ్ ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. దీనిపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసి, ఆ సంస్థతో ఒప్పందాలను నిలిపివేయాలని నిర్ణయించారు.

ఇక ఓపెన్‌ఏఐ సీఈఓ Sam Altman, పెంటగాన్‌తో భాగస్వామ్యం కుదిరిందని వెల్లడించారు. ఈ పరిణామం ఏఐ రంగంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలపై కొత్త చర్చకు దారితీసింది. రక్షణ రంగంలో కృత్రిమ మేధస్సు వినియోగంపై భవిష్యత్తులో మరిన్ని మార్పులు సంభవించే అవకాశముంది.

ALSO READ:Prabhas Spirit Villain Look | స్పిరిట్‌లో విలన్‌ లుక్ రివీల్

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp