Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshGeethu Royal controversy | తిరుమలలో గీతు రాయల్ రీల్ వివాదం

Geethu Royal controversy | తిరుమలలో గీతు రాయల్ రీల్ వివాదం

-

Chat on WhatsApp

Geethu Royal controversy: పవిత్రక్షేత్రం తిరుమలలో బిగ్‌బాస్ ఫేమ్ గీతు రాయల్(Geethu Royal) చేసిన రీల్ ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఆమె, ఆలయం ముందు తన నలుగురు మగ స్నేహితులతో కలిసి ఖడ్గం సినిమాలోని పాటకు స్టెప్పులు వేస్తూ వీడియో చిత్రీకరించారు.

అంతేకాకుండా ఘాట్ రోడ్డులో కారు ఆపి మరొక రీల్ చేయడం కూడా విమర్శలకు కారణమైంది. భక్తిభావంతో ఉండాల్సిన ప్రదేశంలో సినిమా పాటలతో రీల్స్ చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భక్తుల రద్దీ, భద్రత పరిరక్షణలో ఇప్పటికే సవాళ్లు ఎదుర్కొంటున్న TTD కు ఈ ఘటన కొత్త తలనొప్పిగా మారింది. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో గీతు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి వీడియోలను తొలగించారు. అయితే టీటీడీ చర్యలకు సిద్ధమవుతోందన్న వార్తలపై ఆమె మరో వీడియో విడుదల చేశారు.

“నా మీద చర్యలు తీసుకుంటారట.. సంతోషంగా ఉండండి. నా జీవితంలో సగం ఇప్పటికే కోల్పోయాను, మిగిలింది కూడా తీసేసి ఆనందించండి” అంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. పవిత్ర స్థలాల్లో సెలబ్రిటీల ప్రవర్తనపై మళ్లీ చర్చ మొదలైంది.

ALSO READ:Ranji Trophy 2025-26 | రంజీ ఫైనల్లో జమ్మూ కాశ్మీర్ ఘన విజయం

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp