Friday, April 17, 2026
Chat on WhatsApp
HomeNationalNarendra Modi launching HPV vaccination | దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా కార్యక్రమానికి శ్రీకారం

Narendra Modi launching HPV vaccination | దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా కార్యక్రమానికి శ్రీకారం

-

Chat on WhatsApp

దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు.అజ్మేర్‌ (Ajmer), రాజస్థాన్‌ లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని అధికారికంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ (సర్వైకల్ క్యాన్సర్)తో పాటు హెచ్‌పీవీ వల్ల కలిగే ఇతర నివారించదగిన క్యాన్సర్లను అరికట్టడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొంది.

ఈ కార్యక్రమంలో భాగంగా 14 సంవత్సరాల బాలికలకు ఉచితంగా గార్డాసిల్‌(Gardasil) టీకా ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల ద్వారా దశలవారీగా ఈ టీకా అందించబడుతుంది.

హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టైప్ 16, 18 వంటి అధిక ప్రమాద రకాలతో పాటు టైప్ 6, 11 నుంచి కూడా ఈ వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో సర్వైకల్ క్యాన్సర్ కేసులు అధికంగా ఉన్న నేపథ్యంలో ముందస్తు రక్షణ చర్యగా ఈ టీకా కార్యక్రమం కీలకంగా భావిస్తున్నారు.

నిపుణుల ప్రకారం, బాల్యదశలోనే టీకా ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ప్రజల్లో అవగాహన పెంచడం, తల్లిదండ్రులను చైతన్యవంతులను చేయడం ఈ కార్యక్రమ విజయానికి కీలకం కానుంది.

ALSO READ:Vijay Deverakonda Wedding | పెళ్లి ఫోటోలతో విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన రష్మిక

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

AP 10th Class 2026 exam results update and evaluation process information

AP 10th Class Results | ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్…త్వరలో పదో తరగతి...

AP 10th Class Results: ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 ఏప్రిల్ 3తో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 3,415 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించగా, మొత్తం 6,40,916...
- Advertisement -
Chat on WhatsApp

Fatal error: Uncaught Error: Call to a member function hasAttribute() on int in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php:102 Stack trace: #0 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(102): WP_Optimize_Minify_Unused_Css->remove_unused_css() #1 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(37): WPO_Page_Optimizer->maybe_remove_unused_css() #2 [internal function]: WPO_Page_Optimizer->optimize() #3 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/functions.php(5481): ob_end_flush() #4 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(341): wp_ob_end_flush_all() #5 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(365): WP_Hook->apply_filters() #6 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/plugin.php(522): WP_Hook->do_action() #7 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/load.php(1308): do_action() #8 [internal function]: shutdown_action_hook() #9 {main} thrown in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php on line 102