Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshLondon Fire Accident | లండన్ అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు యువకులు మృ**తి

London Fire Accident | లండన్ అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు యువకులు మృ**తి

-

Chat on WhatsApp

London Fire Accident: లండన్‌లోని క్రొయిడాన్‌(Croydon) ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదం మరో తెలుగు కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. నాలుగు రోజుల క్రితం డుప్పాస్ హిల్స్ టెర్రాస్‌లోని రెండు అంతస్తుల నివాసంలో గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగి భారీ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గొంతి అభిషేక్‌(Gonthi Abhishek) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన నిజామాబాద్ విద్యార్థి సాయి శ్రీకర్ ను వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు.

ఎంబీఏ పూర్తిచేసిన అభిషేక్, సాయి శ్రీకర్ ఇద్దరూ ఒకే గదిలో నివసిస్తూ పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు. గత రాత్రి గ్యాస్ లీక్ కావడంతో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తు వరకు మంటలు, దట్టమైన పొగ వ్యాపించాయి.

బయటపడేలోపే ఇద్దరూ మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. ప్రమాదం నుంచి తప్పించుకున్న మరో విద్యార్థి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

సాయి శ్రీకర్ బ్రెయిన్ డెడ్ అయిన నేపథ్యంలో అతని తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించడం హృదయాన్ని కదిలిస్తోంది. ఈ విషాద ఘటన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. విదేశాల్లో చదువుకునే తెలుగు విద్యార్థుల భద్రతపై మరోసారి చర్చ ప్రారంభమైంది.

ALSO READ:Pakistan-Afghanistan War | అఫ్గాన్–పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp