Thursday, April 16, 2026
Chat on WhatsApp
HomeNationalAI Summit లో అద్భుతం టెక్నాలజీతో జీవం పొందిన కృష్ణార్జునులు 

AI Summit లో అద్భుతం టెక్నాలజీతో జీవం పొందిన కృష్ణార్జునులు 

-

Chat on WhatsApp

AI Summit: ఢిల్లీలో జరుగుతున్న AI Summitలో హైటెక్ ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. అందులో ముఖ్యంగా ‘కృష్ణార్జునులు’ డిజిటల్ హోలోగ్రామ్ రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిఓ ఇంటెలిజెన్స్ (Jio Intelligence) అత్యాధునిక హోలోగ్రామ్ టెక్నాలజీతో పాటు కృత్రిమ మేధ సాయంతో ఈ రూపాలను రూపొందించింది.

భారతీయ ఇతిహాసం మహాభారతంలోని(Mahabharatam) పాత్రలను ఆధునిక సాంకేతికతతో ప్రాణం ఉన్నట్టుగా చేసిన విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

‘మహాభారత్‌: ఏక్‌ ధర్మ్‌ యుద్ధ్‌’ సిరీస్‌లోని కృష్ణుడు, అర్జునుడు తదితర పాత్రలను డిజిటల్ రూపంలో ప్రదర్శిస్తూ, సందర్శకులు వారితో ప్రత్యక్షంగా మాట్లాడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సందర్శకులు అడిగిన ప్రశ్నలకు ఈ డిజిటల్ రూపాలు సమాధానాలు ఇస్తుండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

యువతలో భారతీయ సంస్కృతి, ఇతిహాసాలపై ఆసక్తి పెంచడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. టెక్నాలజీ, సంస్కృతి కలయికగా రూపొందిన ఈ ప్రదర్శన సదస్సులో ప్రత్యేక హైలైట్‌గా మారింది.

సాంప్రదాయ కథలను ఆధునిక డిజిటల్ అనుభవంగా మలచిన విధానం భవిష్యత్తులో ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో కొత్త అవకాశాలకు దారితీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘మహాభారత్‌: ఏక్‌ ధర్మ్‌ యుద్ధ్‌’ సిరీస్ ప్రస్తుతం JioHotstarలో అందుబాటులో ఉంది.

ALSO READ:SBI CBO Recruitment 2026 | గ్రాడ్యుయేట్లకు శుభవార్త.. SBIలో 2273 ఉద్యోగాలు

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

heatwave conditions in telangana with high temperatures and orange alert warning

Telangana Heat Wave | తెలంగాణలో మండుతున్న ఎండలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు

Telangana Heat Wave: తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్(Orange Alert) జారీ చేసింది. వచ్చే మూడు రోజుల...
- Advertisement -
Chat on WhatsApp

Fatal error: Uncaught Error: Call to a member function hasAttribute() on int in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php:102 Stack trace: #0 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(102): WP_Optimize_Minify_Unused_Css->remove_unused_css() #1 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(37): WPO_Page_Optimizer->maybe_remove_unused_css() #2 [internal function]: WPO_Page_Optimizer->optimize() #3 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/functions.php(5481): ob_end_flush() #4 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(341): wp_ob_end_flush_all() #5 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(365): WP_Hook->apply_filters() #6 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/plugin.php(522): WP_Hook->do_action() #7 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/load.php(1308): do_action() #8 [internal function]: shutdown_action_hook() #9 {main} thrown in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php on line 102