Sunday, July 26, 2026
Chat on WhatsApp
HomeNationalRanji Trophy 2025-26 | రంజీ ఫైనల్లో జమ్మూ కాశ్మీర్ ఘన విజయం

Ranji Trophy 2025-26 | రంజీ ఫైనల్లో జమ్మూ కాశ్మీర్ ఘన విజయం

-

Chat on WhatsApp

Ranji Trophy 2025-26: భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో జమ్మూ కాశ్మీర్ జట్టు స్వర్ణాక్షరాలతో పేరు నిలిపింది. Ranji Trophy 2025-26 సీజన్ ఫైనల్లో కర్ణాటకపై తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగుల భారీ ఆధిక్యం సాధించి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.

ఐదో రోజు మ్యాచ్ డ్రాగా ముగిసినా, నిబంధనల ప్రకారం ఆధిక్యం ఆధారంగా జమ్మూ కాశ్మీర్‌ను విజేతగా ప్రకటించారు. 67 ఏళ్ల నిరీక్షణ తర్వాత తొలి సారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని కైవసం చేసుకోవడం రాష్ట్రానికి గర్వకారణమైంది.

తొలి ఇన్నింగ్స్‌లో శుభమ్ పుండిర్ 121 పరుగులతో శతకం సాధించగా జట్టు మొత్తం 584 పరుగులు చేసింది. కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకే పరిమితమైంది. జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ 5 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటింగ్‌ను కుదేలు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఖమ్రాన్ ఇక్బాల్ 154 నాటౌట్, సాహిల్ లోత్రా 101 నాటౌట్ శతకాలతో జట్టును బలపరిచారు.

కర్ణాటక తరఫున మయాంక్ అగర్వాల్ 160 పరుగులతో పోరాడినా ఫలితం లేకపోయింది. జట్టు విజయాన్ని అభినందించేందుకు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాహ్ (Omar Abdullah) స్వయంగా మైదానానికి విచ్చేసి ఆటగాళ్లను ప్రోత్సహించారు. ఈ విజయం జమ్మూ కాశ్మీర్ క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది.

ALSO READ:Kakinada Explosion | కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం..18 మంది మృతి

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp