Thursday, March 12, 2026
No menu items!
HomeInterNationalT20 world cup 2026 | కెనడాను చిత్తు చేసిన న్యూజిలాండ్.. సూపర్–8కి కివీస్

T20 world cup 2026 | కెనడాను చిత్తు చేసిన న్యూజిలాండ్.. సూపర్–8కి కివీస్

- Advertisement -
Google search engine

T20 World Cup లో న్యూజిలాండ్ జట్టు మరో ఘన విజయం సాధించింది. కెనడాతో జరిగిన కీలక గ్రూప్ డీ మ్యాచ్‌లో కివీస్ 8 వికెట్ల తేడాతో గెలిచి సూపర్–8 దశకు అర్హత సాధించింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెనడా ముందుగా బ్యాటింగ్ చేసింది.

భారతీయ సంతతికి చెందిన కెనడా బ్యాటర్ యువరాజ్ సమ్రా అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 65 బంతుల్లో 110 పరుగులు చేసి, 11 ఫోర్లు, 6 సిక్సర్లతో స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు.

యువరాజ్ సమ్రా–బజ్వా జోడీ తొలి వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో కెనడా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం చూపించారు. “Rachin Ravindra”(ర‌చిన్ ర‌వీంద్ర‌) 39 బంతుల్లో 59 పరుగులు, “Glenn Phillips”(గ్లెన్ ఫిలిప్స్‌) 36 బంతుల్లో 77 పరుగులు చేసి జట్టును విజయం దిశగా నడిపించారు.

మూడో వికెట్‌కు ఈ ఇద్దరూ అజేయంగా 146 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా కివీస్ కేవలం 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో న్యూజిలాండ్ అధికారికంగా సూపర్–8లోకి అడుగుపెట్టింది.

YouTube thumbnailYouTube icon
- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular