దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు.అజ్మేర్ (Ajmer), రాజస్థాన్ లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని అధికారికంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్)తో పాటు హెచ్‌పీవీ వల్ల కలిగే ఇతర నివారించదగిన క్యాన్సర్లను అరికట్టడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొంది.
ఈ కార్యక్రమంలో భాగంగా 14 సంవత్సరాల బాలికలకు ఉచితంగా గార్డాసిల్(Gardasil) టీకా ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల ద్వారా దశలవారీగా ఈ టీకా అందించబడుతుంది.
హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టైప్ 16, 18 వంటి అధిక ప్రమాద రకాలతో పాటు టైప్ 6, 11 నుంచి కూడా ఈ వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో సర్వైకల్ క్యాన్సర్ కేసులు అధికంగా ఉన్న నేపథ్యంలో ముందస్తు రక్షణ చర్యగా ఈ టీకా కార్యక్రమం కీలకంగా భావిస్తున్నారు.
నిపుణుల ప్రకారం, బాల్యదశలోనే టీకా ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ప్రజల్లో అవగాహన పెంచడం, తల్లిదండ్రులను చైతన్యవంతులను చేయడం ఈ కార్యక్రమ విజయానికి కీలకం కానుంది.
ALSO READ:Vijay Deverakonda Wedding | పెళ్లి ఫోటోలతో విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన రష్మిక








