Sunday, July 26, 2026
Chat on WhatsApp
HomeNationalఅసెంబ్లీ ఎన్నికల ముందు తమిళ రాజకీయాల్లో ట్విస్ట్...పార్టీ మారిన పన్నీర్ సెల్వం

అసెంబ్లీ ఎన్నికల ముందు తమిళ రాజకీయాల్లో ట్విస్ట్…పార్టీ మారిన పన్నీర్ సెల్వం

-

Chat on WhatsApp

Panneerselvam: తమిళనాడు రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అధికారికంగా M. K. స్టాలిన్‌ నాయకత్వంలోని DMK (డీఎంకే)లో చేరారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో స్టాలిన్ స్వయంగా కండువా కప్పి సెల్వంను పార్టీలోకి స్వాగతం పలికారు.

ఆయనతో పాటు కుమారుడు, మాజీ ఎంపీ రవీంద్రనాథ్, ఎమ్మెల్యే అయ్యప్పన్ తదితరులు కూడా డీఎంకే గూటికి చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అన్నాడీఎంకేలో విభేదాల తర్వాత బహిష్కరణకు గురైన సెల్వం, ఇటీవల ఎన్డీయేతోనూ(NDA) దూరమయ్యారు. గతంలో All India Anna Dravida Munnetra Kazhagam(AIADMK)లో కీలక నేతగా, దివంగత జయలలితకు సన్నిహితుడిగా ఉన్న ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

2022లో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామితో విభేదాల నేపథ్యంలో బహిష్కరణ ఎదుర్కొన్నారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన స్వస్థలమైన తేని జిల్లాలోని బోడి మెట్టు నియోజకవర్గం నుంచి డీఎంకే తరఫున పోటీ చేసే అవకాశమున్నట్లు సమాచారం. ఎన్నికల వేళ సెల్వం చేరిక డీఎంకేకు వ్యూహాత్మకంగా లాభదాయకమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ALOS READ:Bank holidays | మార్చి 2026లో బ్యాంకు సెలవులు…ఎన్ని రోజులంటే ?

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp