Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeNationalMaharashtra | మహారాష్ట్రలో విషాదం.. ఆలయంలో కూలిన స్లాబ్ ఐదుగురికి గాయాలు, ఒకరు ?

Maharashtra | మహారాష్ట్రలో విషాదం.. ఆలయంలో కూలిన స్లాబ్ ఐదుగురికి గాయాలు, ఒకరు ?

-

Chat on WhatsApp

Maharashtra: మహారాష్ట్రలోని పర్భాణి జిల్లాలో శనివారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. సేలు తాలూకాలోని రావల్గావ్ గ్రామానికి చెందిన పురాతన హనుమాన్ ఆలయంలో పైకప్పు భాగంలోని కాంక్రీట్ స్లాబ్ అకస్మాత్తుగా కూలిపోవడంతో అక్కడ ఉన్న భక్తుల్లో ఒకరు మృ**తి చెందగా, మరో ఐదుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. శనివారం కావడంతో ఉదయాన్నే ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అదే సమయంలో భక్తులు గర్భగుడి బయట నిలబడి ప్రార్థనలు చేస్తున్న సమయంలో పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఉత్తమ్ రావు లహనే (65) అనే వృద్ధుడు శిథిలాల కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు.

అలాగే మరికొంత మంది భక్తులు శిథిలాల కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టి వారిని బయటకు తీసుకువచ్చారు. గాయపడిన వారిని జాల్నా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారికి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఆలయం చాలా పాతదిగా ఉండటం, ఇటీవలి వర్షాల కారణంగా కాంక్రీట్ బలహీనపడటమే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ దుర్ఘటనతో రావల్గావ్ గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp