LIVE
Thursday, November 12, 2026
LIVE
LIVE

AP Municipal Elections 2026 | ఏపీలో మరో ఎన్నికల సమరం.. నవంబర్ 14న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్

by Bajaswamy
5 views
AP Municipal Elections 2026

AP Municipal Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి మరింత పెరగనుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కొనసాగుతుండగా.. తాజాగా పట్టణ ప్రాంతాల్లోనూ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం 19 మున్సిపాలిటీలు, 4 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న అధికారిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఆయా 23 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో గురువారం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రాజకీయ పార్టీల ప్రచారాలు, అభ్యర్థుల ఎంపికపై ఆసక్తి నెలకొంది. మొత్తంగా ఏపీ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More