Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeInterNationalIsrael and Hezbollah | లెబనాన్ ఉద్రిక్తతలకు బ్రేక్?.. ఇజ్రాయెల్-హిజ్‌బుల్లా సీజ్‌ఫైర్‌పై అమెరికా కీలక ప్రకటన

Israel and Hezbollah | లెబనాన్ ఉద్రిక్తతలకు బ్రేక్?.. ఇజ్రాయెల్-హిజ్‌బుల్లా సీజ్‌ఫైర్‌పై అమెరికా కీలక ప్రకటన

-

Chat on WhatsApp

Israel and Hezbollah: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్, హిజ్‌బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అమెరికాకు చెందిన ఓ అధికారి వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇటీవల జరిగిన పరస్పర దాడుల అనంతరం ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

శుక్రవారం దక్షిణ లెబనాన్ ప్రాంతంపై ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడించాయి. మరోవైపు హిజ్‌బుల్లా చేపట్టిన దాడుల్లో ఇజ్రాయెల్ సైన్యానికి కూడా నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ పరిణామాలు రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ధృవీకరించినట్లు తెలుస్తోంది.

అయితే పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఐడీఎఫ్ పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఒప్పందంపై హిజ్‌బుల్లా నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. హిజ్‌బుల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నయీమ్ ఖాసిమ్ ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో, తమ సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న ఇజ్రాయెల్ లక్ష్యం ఇంకా నెరవేరలేదని పేర్కొన్నారు.

ఇదే సమయంలో ఇరాన్-అమెరికా మధ్య చర్చలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడం కూడా ప్రాంతీయ పరిస్థితులపై ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రాచ్య పరిస్థితులు ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోకపోయినా, తాజా కాల్పుల విరమణ ప్రకటన ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గించే దిశగా ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp