Tuesday, August 4, 2026
Chat on WhatsApp
HomeInterNationalNetanyahu | మోడీ నాయకత్వంపై నెతన్యాహు ప్రశంసలు.. భారత్-ఇజ్రాయెల్ బంధం మరింత బలోపేతం

Netanyahu | మోడీ నాయకత్వంపై నెతన్యాహు ప్రశంసలు.. భారత్-ఇజ్రాయెల్ బంధం మరింత బలోపేతం

-

Chat on WhatsApp

Netanyahu: భారత్‌తో తమ స్నేహ బంధం ఎంతో ప్రత్యేకమైనదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి స్పష్టం చేశారు. ప్రపంచ రాజకీయాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్న వేళ భారత్ తమకు నమ్మకమైన మిత్రదేశంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తమ దేశానికి గొప్ప స్నేహితుల్లో ఒకరని ప్రశంసించిన ఆయన.. భారత్‌తో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కొందరు తమ దేశం ఒంటరిగా మారిందని విమర్శిస్తున్నప్పటికీ, భారత్ వంటి కీలక భాగస్వాములు అండగా నిలుస్తున్నారని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని వెల్లడించారు.

గత కొన్నేళ్లుగా భారత్-ఇజ్రాయెల్ ద్వైపాక్షిక సంబంధాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని నెతన్యాహు పేర్కొన్నారు. ముఖ్యంగా రక్షణ, సాంకేతికత, వాణిజ్యం, భద్రతా సహకారం వంటి రంగాల్లో ఇరు దేశాలు కలిసి ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలు రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు దోహదపడ్డాయని పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు, రక్షణ రంగం, ఆరోగ్య సంరక్షణ, కార్మిక సంక్షేమం వంటి విభాగాల్లో సహకారాన్ని పెంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. రెండు దేశాల మధ్య స్నేహం, సహకారం భవిష్యత్తులో కొత్త శిఖరాలకు చేరుకుంటుందని భారత్, ఇజ్రాయెల్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

E20 Petrol Quality Check: Government Clarifies Fuel Standards and Safety Measures

E20 పెట్రోల్ సేఫేనా?.. కేంద్రం చెప్పిన కీలక విషయాలు ఇవే

E20 Petrol Quality Check: E20 పెట్రోల్‌పై నెలకొన్న అపోహలకు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వినియోగదారులకు అందించే ఇంధనం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో చమురు సంస్థలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని...
- Advertisement -
Chat on WhatsApp