LIVE
Saturday, November 14, 2026
LIVE
LIVE

India vs Sri Lanka Test | సుతార్‌ దెబ్బకు లంక విలవిల.. శ్రీలంకపై భారత్ ఘన విజయం!

by Bajaswamy
8 views
India vs Sri Lanka Test

India vs Sri Lanka Test: శ్రీలంక గడ్డపై టీమిండియా సత్తా చాటింది. ఉత్కంఠగా సాగిన తొలి టెస్టులో భారత జట్టు 165 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత యువ స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ అద్భుత బౌలింగ్‌తో విజయానికి ప్రధాన కారణంగా నిలిచాడు. 372 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి 206 పరుగులకే కుప్పకూలింది. సోనాల్ దినుష 84, ధనంజయ డిసిల్వా 59 పరుగులతో పోరాడినా జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు. మానవ్‌ సుతార్‌ 6/55తో చెలరేగగా.. ప్రసిద్ధ్‌ కృష్ణ రెండు వికెట్లు, మహ్మద్‌ సిరాజ్‌, రవీంద్ర జడేజా చెరో వికెట్‌ తీశారు.

మ్యాచ్‌ చివరి దశలో సుతార్‌ వేసిన 76వ ఓవర్‌ శ్రీలంక పతనాన్ని ఖరారు చేసింది. సోనాల్‌ దినుషను ఔట్ చేసిన వెంటనే ప్రభాత్‌ జయసూర్యను బౌల్డ్‌ చేసిన సుతార్‌.. ఓవర్‌ చివరి బంతికి లాహిరు కుమారను కూడా పెవిలియన్‌కు పంపాడు. దినుష క్యాచ్‌ను ధ్రువ్‌ జురెల్‌, లాహిరు క్యాచ్‌ను రిషభ్‌ పంత్‌ అందుకున్నారు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేయగా, శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 193 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి సుతార్‌ ఏకంగా 10 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శన చేశాడు.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More