Friday, July 24, 2026
Chat on WhatsApp
HomeSportsSemifinal Race | వరుస విజయాలకు బ్రేక్.. సెమీస్ చేరాలంటే భారత్ ఇలా చేయాల్సిందే

Semifinal Race | వరుస విజయాలకు బ్రేక్.. సెమీస్ చేరాలంటే భారత్ ఇలా చేయాల్సిందే

-

Chat on WhatsApp

Semifinal Race: అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికా(South Africa)తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత జట్టు 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో టీ20 ప్రపంచకప్‌ 2026 లో భారత్ వరుసగా సాధించిన 12 విజయాల జైత్రయాత్రకు బ్రేక్ పడింది.

సెమీఫైనల్స్(Semifinals) అవకాశాలు కొంత క్లిష్టంగా మారినప్పటికీ పూర్తిగా దారులు మూసుకుపోలేదు. అయితే మిగిలిన మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన తప్పనిసరి.

భారత్‌పై విజయం సాధించిన సౌత్ ఆఫ్రికా జట్టు గ్రూప్ 1లో 2 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. భారీ ఓటమి కారణంగా భారత్ నెట్ రన్‌రేట్ -3.800కి పడిపోయింది. సూపర్ 8 దశలో భారత్ ఇంకా జింబాంబే (Zimbabwe) వెస్ట్ ఇండీస్ (West Indies) జట్లతో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

సెమీస్ ఆశలు నిలుపుకోవాలంటే ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలవాలి. అలా జరిగితే భారత్ ఖాతాలో 4 పాయింట్లు చేరతాయి. అదే సమయంలో జింబాబ్వే, వెస్టిండీస్ జట్లలో ఏదీ 4 పాయింట్లకు చేరకపోతే భారత్ నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది.

ఒకే మ్యాచ్ గెలిస్తే పరిస్థితి మరింత సంక్లిష్టమవుతుంది. అప్పుడు దక్షిణాఫ్రికా తన మిగతా మ్యాచ్‌ల్లో గెలవాలి. అలాగే వెస్టిండీస్-జింబాబ్వే మ్యాచ్‌లో గెలిచిన జట్టును భారత్ ఓడించాలి.

ఆపై నెట్ రన్‌రేట్ కీలకంగా మారుతుంది. కాబట్టి భారత్ కేవలం గెలవడం మాత్రమే కాకుండా భారీ తేడాతో విజయాలు సాధించడం అత్యంత అవసరం.

READ MORE:AP Intermediate Exams | రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు…కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp