Thursday, August 6, 2026
Chat on WhatsApp
HomeSportsFaf du Plessis | 41 ఏళ్ల వయసులో ఫాఫ్ డు ప్లెసిస్ దూకుడు.. శతకంతో...

Faf du Plessis | 41 ఏళ్ల వయసులో ఫాఫ్ డు ప్లెసిస్ దూకుడు.. శతకంతో సూపర్ షో

-

Chat on WhatsApp

Faf du Plessis: మేజర్ లీగ్ క్రికెట్ (MLC 2026) సీజన్ ఆరంభ మ్యాచ్ అభిమానులకు అసలైన వినోదాన్ని అందించింది. భారీ స్కోర్లు, రికార్డు భాగస్వామ్యాలు, ఉత్కంఠభరిత ఛేజింగ్ మధ్య దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ తన అనుభవాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాడు. టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహిస్తున్న అతడు అద్భుత శతకంతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

మొదట బ్యాటింగ్ చేసిన సియాటెల్ ఓర్కాస్ ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్, షయాన్ జహంగీర్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలి వికెట్‌కు 191 పరుగులు జోడించి ఎంఎల్‌సీ చరిత్రలోనే అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. సీఫెర్ట్ సెంచరీ చేయగా, జహంగీర్ వేగవంతమైన అర్ధశతకంతో జట్టును 220 పరుగుల భారీ స్కోరుకు చేర్చాడు. 221 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.

అయితే కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ బాధ్యతను తన భుజాలపై వేసుకుని అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రీలీ రూసోతో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన అతడు, మిడిల్ ఆర్డర్ నుంచి సరైన సహకారం లేకపోయినా చివరి వరకు నిలబడి జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ క్రమంలో 41 సంవత్సరాల 340 రోజుల వయసులో శతకం నమోదు చేసిన ఫాఫ్, టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక వయసులో సెంచరీ సాధించిన ఆటగాడిగా కొత్త రికార్డును నెలకొల్పాడు.

217కు పైగా స్ట్రైక్‌రేట్‌తో ఆడిన అతని ఇన్నింగ్స్ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది. చివరి క్షణాల్లో ముల్డర్ అందించిన వేగవంతమైన సహకారం టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను విజయ తీరాలకు చేర్చింది. ఈ విజయంతో జట్టు 2026 సీజన్‌ను ఘనంగా ప్రారంభించగా, ఫాఫ్ డు ప్లెసిస్ మరోసారి టీ20 క్రికెట్‌లో తన ప్రత్యేకతను నిరూపించాడు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Ishan Kishan at the RBI Patna regional office after joining as Assistant Manager under the sports quota.

Ishan Kishan | క్రికెట్, ప్రభుత్వ ఉద్యోగం రెండూ కలిసి.. ఇషాన్ కిషన్ డబుల్...

Ishan Kishan: టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. క్రికెట్ కెరీర్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో అడుగుపెట్టిన ఆయన, "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)"లో అసిస్టెంట్...
- Advertisement -
Chat on WhatsApp