Saturday, July 4, 2026
Chat on WhatsApp
HomeSportsIPL 2026 | క్లాసెన్-సంజు శాంసన్ మధ్య మాటామాటా.. అంపైర్లు జోక్యం

IPL 2026 | క్లాసెన్-సంజు శాంసన్ మధ్య మాటామాటా.. అంపైర్లు జోక్యం

-

Chat on WhatsApp

ఐపీఎల్ 2026(IPL 2026)లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్ స్టంపౌట్ వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ కీలక దశలో చోటుచేసుకున్న ఈ ఘటన మైదానంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.

క్లాసెన్ అవుట్ అయిన వెంటనే వికెట్ కీపర్ సంజు శాంసన్‌తో వాగ్వాదానికి దిగడంతో ఆటగాళ్లు, అంపైర్లు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. చెన్నై బౌలర్ నూర్ అహ్మద్ వేసిన గూగ్లీకి క్లాసెన్ క్రీజ్ వదిలి ముందుకు వచ్చి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో వికెట్ల వెనుక అప్రమత్తంగా ఉన్న సంజు శాంసన్ మెరుపు వేగంతో బైల్స్ తొలగించాడు. రీప్లేలో క్లాసెన్ కాలు గాల్లో ఉండటం స్పష్టంగా కనిపించడంతో అంపైర్లు స్టంపౌట్‌గా ప్రకటించారు.

అవుట్ నిర్ణయం తర్వాత క్లాసెన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. పెవిలియన్‌కు వెళ్లే ముందు నేరుగా సంజు శాంసన్ వద్దకు వెళ్లి మాట్లాడడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. మొదట సాధారణ చర్చలా కనిపించినా, క్రమంగా హావభావాలు మారడంతో మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభిమానులు కూడా ఈ దృశ్యాన్ని ఆసక్తిగా వీక్షించారు.

పరిస్థితి మరింత విషమించకుండా అంపైర్లు వెంటనే జోక్యం చేసుకున్నారు. చెన్నై ఆల్‌రౌండర్ శివమ్ దూబే కూడా క్లాసెన్‌ను శాంతింపజేసే ప్రయత్నం చేశాడు.

అనంతరం క్లాసెన్ పెవిలియన్‌కు వెళ్లగా మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో అభిమానులు భిన్నాభిప్రాయాలు చెబుతున్నారు. కొందరు సంజు శాంసన్ వికెట్ కీపింగ్‌ను ప్రశంసిస్తుండగా, మరికొందరు క్లాసెన్ ఆగ్రహాన్ని చర్చిస్తున్నారు

ALSO READ:Petrol and Diesel Prices | అంతర్జాతీయ క్రూడాయిల్ ఎఫెక్ట్.. దేశంలో పెరిగిన ఫ్యూయల్ ధరలు


- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh chief minister chandrababu naidu addressing public meeting in kuppam

Kuppam | కుప్పంలో బంగారం ఉత్పత్తి చేస్తాం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Kuppam: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై మరోసారి తన దీర్ఘకాలిక విజన్‌ను వెల్లడించారు. శనివారం కుప్పంలో పర్యటించిన ఆయన, ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ అభివృద్ధి కేంద్రంగా...
- Advertisement -
Chat on WhatsApp