Saturday, July 4, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTKamal Haasan | ‘కల్కి పార్ట్ 2’ కోసం ఎకానమీ క్లాస్‌...కమల్ హాసన్ సింప్లిసిటీకి ఫిదా

Kamal Haasan | ‘కల్కి పార్ట్ 2’ కోసం ఎకానమీ క్లాస్‌…కమల్ హాసన్ సింప్లిసిటీకి ఫిదా

-

Chat on WhatsApp

సీనియర్ నటుడు కమల్ హాసన్(Kamal Haasan) మరోసారి తన సింప్లిసిటీతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘కల్కి 2898 AD పార్ట్ 2’(Kalki 2898 AD Part 2) షూటింగ్‌లో పాల్గొనడానికి చెన్నై నుంచి హైదరాబాద్‌కు ఆయన ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సంక్షోభం కారణంగా రాజకీయ, ఆర్థిక అనిశ్చితి ప్రభావం సినీ పరిశ్రమపై కూడా పడుతోందని పేర్కొన్న కమల్ హాసన్, సినిమా నిర్మాణ వ్యయాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అని అయన సూచించారు. అయితే ఆ మాటలను కేవలం సూచనలుగా కాకుండా స్వయంగా ఆచరణలో పెట్టి చూపించడం ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రశంసలు అందుకుంటోంది.

సాధారణంగా స్టార్ హీరోలు చార్టర్ విమానాలు లేదా బిజినెస్ క్లాస్ సౌకర్యాలను వినియోగిస్తుంటారు. కానీ కమల్ హాసన్ మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా సాధారణ ప్రయాణికుడిలా ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించి నేరుగా షూటింగ్ సెట్స్‌కు చేరుకున్నారు.

దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ కూడా ప్రత్యేకంగా స్పందించింది. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో కమల్ ఫొటోను పంచుకుంటూ, పరిశ్రమ కష్టకాలంలో ఉన్నప్పుడు విలాసవంతమైన ప్రయాణాలను పక్కనపెట్టి సాధారణ ప్రయాణాన్ని ఎంచుకోవడం కమల్ లాంటి లెజెండ్‌కే సాధ్యమని ప్రశంసించింది.

కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ఓ బహిరంగ లేఖలో సినిమా కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి తెరపై నాణ్యతగా కనిపించాలని, కానీ కార్మికుల వేతనాలు, భద్రత, భోజన సౌకర్యాల విషయంలో మాత్రం రాజీ ఉండకూడదని కమల్ హాసన్ పేర్కొన్నారు.

ఇప్పుడు అదే సూత్రాలను ఆయన స్వయంగా పాటించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి పార్ట్ 2’లో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా, కమల్ హాసన్ ‘సుప్రీం యాస్కిన్’ పాత్రలో కీలకంగా కనిపించనున్నారు.

ALSO READ: Petrol and Diesel Prices | అంతర్జాతీయ క్రూడాయిల్ ఎఫెక్ట్.. దేశంలో పెరిగిన ఫ్యూయల్ ధరలు


- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

viral controversial book cover seen in hyderabad metro sparks social media debate

Social Media | మెట్రోలో వైరల్ బుక్ కవర్.. ‘భార్యను బొందపెట్టడం ఎలా?’ ఫొటోపై...

Social Media: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలు తరచూ కొత్త చర్చలకు తెరలేపుతుంటాయి. తాజాగా మెట్రో రైళ్లలో ప్రయాణికులు చదువుతున్నట్లు కనిపించిన రెండు పుస్తకాల కవర్లు నెట్టింట హాట్ టాపిక్‌గా...
- Advertisement -
Chat on WhatsApp