Friday, July 3, 2026
Chat on WhatsApp
HomeSportsCristiano Ronaldo | 41 ఏళ్ల వయసులోనూ రొనాల్డో మ్యాజిక్..   ప్రపంచకప్ నాకౌట్‌లో అరుదైన రికార్డు

Cristiano Ronaldo | 41 ఏళ్ల వయసులోనూ రొనాల్డో మ్యాజిక్..   ప్రపంచకప్ నాకౌట్‌లో అరుదైన రికార్డు

-

Chat on WhatsApp

పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) మరోసారి తన అసాధారణ ప్రతిభను చాటుతూ ప్రపంచ ఫుట్‌బాల్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ప్రపంచకప్ నాకౌట్ దశలో అత్యధిక వయసులో గోల్ చేసిన ఆటగాడిగా నిలిచి కొత్త చరిత్ర సృష్టించాడు. క్రొయేషియాతో జరిగిన కీలక మ్యాచ్‌లో గోల్ నమోదు చేసిన సమయంలో రొనాల్డో వయసు 41 సంవత్సరాలు 147 రోజులు కావడం విశేషం. అంతేకాకుండా, ప్రపంచకప్ నాకౌట్ దశలో ఆయన కెరీర్‌లో నమోదైన తొలి గోల్ కూడా ఇదే కావడం మరో ప్రత్యేకత.

ఈ ఘనతతో గతంలో పోర్చుగల్ మాజీ డిఫెండర్ పెపే పేరిట ఉన్న రికార్డు చెరిపివేయబడింది. 2022 ప్రపంచకప్‌లో పెపే 39 సంవత్సరాల 283 రోజుల వయసులో గోల్ చేసి ఈ రికార్డును నెలకొల్పగా, ఇప్పుడు రొనాల్డో దానిని అధిగమించాడు. మ్యాచ్ ఆరంభంలో క్రొయేషియా ఆధిపత్యం ప్రదర్శించి తొలి గోల్ సాధించింది. పోర్చుగల్‌కు దక్కిన పెనాల్టీ అవకాశాన్ని రొనాల్డో సమర్థంగా వినియోగించుకుని స్కోరును సమం చేశాడు. అంతకుముందు ఆయన అద్భుతంగా బంతిని గోల్‌లోకి పంపించినా, వీఏఆర్ పరిశీలనలో స్వల్ప ఆఫ్‌సైడ్‌గా తేలడంతో ఆ గోల్‌ను రద్దు చేశారు.

స్కోరు సమమైన తర్వాత పోర్చుగల్ ఆటను మరింత వేగవంతం చేసింది. గొంకాలో రామోస్ మరో గోల్ నమోదు చేయడంతో జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి నిమిషాల్లో క్రొయేషియా చేసిన గోల్‌ను కూడా వీఏఆర్ ఆఫ్‌సైడ్ కారణంగా తిరస్కరించడంతో పోర్చుగల్ 2-1 తేడాతో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ విజయంతో తదుపరి దశకు అర్హత సాధించడమే కాకుండా, రొనాల్డో తన కెరీర్‌లో మరో చారిత్రక రికార్డును సొంతం చేసుకుని ప్రపంచ ఫుట్‌బాల్‌లో తన ప్రత్యేక స్థానాన్ని మరోసారి చాటుకున్నాడు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

hernan alberto gil flores rescued alive after eight days under earthquake rubble in venezuela

Venezuela | శిథిలాల కింద 8 రోజులు.. సజీవంగా బయటపడిన సెక్యూరిటీ గార్డు

Venezuela: వెనిజులాలో ఇటీవల సంభవించిన భారీ భూకంపం వేలాది కుటుంబాలను విషాదంలోకి నెట్టింది. అనేక ప్రాణనష్టాలు, భారీ ఆస్తి నష్టం మధ్య ప్రపంచాన్ని కదిలించిన ఓ అద్భుత ఘటన వెలుగులోకి వచ్చింది. భవనం...
- Advertisement -
Chat on WhatsApp