Saturday, July 4, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTPeddi OTT Release | ఓటీటీలోకి ‘పెద్ది’.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?

Peddi OTT Release | ఓటీటీలోకి ‘పెద్ది’.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?

-

Chat on WhatsApp

Peddi OTT Release: థియేటర్లలో ఘన విజయాన్ని నమోదు చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సనా రూపొందించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓటీటీ విడుదల తేదీని ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

నెట్‌ఫ్లిక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, జూలై 9 నుంచి ‘పెద్ది’ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనుండగా, హిందీ వెర్షన్‌ను కూడా త్వరలో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన కేవలం ఐదు వారాల్లోనే ఈ చిత్రం ఓటీటీలోకి రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

గ్రామీణ నేపథ్యాన్ని స్పోర్ట్స్ అంశాలతో మేళవిస్తూ రూపొందించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ కొత్త తరహా పాత్రలో కనిపించారు. భావోద్వేగాలు, యాక్షన్, క్రీడా స్ఫూర్తి కలగలిపిన కథ ప్రేక్షకులను ఆకట్టుకోగా, దర్శకుడు బుచ్చిబాబు సనా టేకింగ్‌కు మంచి ప్రశంసలు లభించాయి. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘పెద్ది’ రామ్ చరణ్ కెరీర్‌లో మరో విజయవంతమైన చిత్రంగా నిలిచింది. థియేటర్లలో భారీ ఆదరణ పొందిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ వేదికపై కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh chief minister chandrababu naidu addressing public meeting in kuppam

Kuppam | కుప్పంలో బంగారం ఉత్పత్తి చేస్తాం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Kuppam: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై మరోసారి తన దీర్ఘకాలిక విజన్‌ను వెల్లడించారు. శనివారం కుప్పంలో పర్యటించిన ఆయన, ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ అభివృద్ధి కేంద్రంగా...
- Advertisement -
Chat on WhatsApp