Gabbar Singh Ramesh: సినీ పరిశ్రమలో సహచర నటుడికి ఆపద సమయంలో మరో నటుడు అండగా నిలిచారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ రమేశ్‌కు నటుడు శ్రీమాన్(Actor Sriman) ఆర్థిక సాయం అందించారు. ప్రస్తుతం రమేశ్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో రమేశ్ విలన్ పాత్రలో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా అంత్యాక్షరి గ్యాంగ్ సభ్యుడిగా ఆయన చేసిన పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుండగా, ఆయన ఆరోగ్యంలో క్రమంగా మెరుగుదల కనిపిస్తున్నట్లు ‘గబ్బర్ సింగ్’ గ్యాంగ్ సభ్యులు తెలిపారు.
రమేశ్ అనారోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న నటుడు శ్రీమాన్ వెంటనే స్పందించి రూ.25 వేల ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు. ‘జనవరి 12న విడుదల’ సినిమాలో రమేశ్, శ్రీమాన్ కలిసి నటించినట్లు తెలిపారు. ఆ సినిమా తర్వాతే రమేశ్ అనారోగ్యానికి గురైనట్లు గ్యాంగ్ సభ్యులు పేర్కొన్నారు.రమేశ్ పరిస్థితి గురించి తెలుసుకున్న వెంటనే శ్రీమాన్ సహాయం చేయడం పట్ల ‘గబ్బర్ సింగ్’ గ్యాంగ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నటుడిగా శ్రీమాన్ ప్రతిభను ప్రశంసిస్తూ కష్టకాలంలో తోటి నటుడికి అండగా నిలవడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం రమేశ్ త్వరగా కోలుకోవాలని సినీ వర్గాలు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. వైద్యుల చికిత్సతో ఆయన మరింతగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: CM Chandrababu Naidu | ఉద్యోగుల నైపుణ్యాలపై బాబు సర్కార్ ఫోకస్.. ఐఐటీ, ఐఐఎంలతో జోడీ
