Thursday, August 6, 2026
Chat on WhatsApp
HomeSportsVVS Laxman | తెలుగు దిగ్గజానికి బంపర్ ఛాన్స్.. చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?

VVS Laxman | తెలుగు దిగ్గజానికి బంపర్ ఛాన్స్.. చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?

-

Chat on WhatsApp

VVS Laxman: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) చీఫ్ సెలెక్టర్ పదవిలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న అజిత్ అగార్కర్(Ajit Agarkar) పదవీకాలాన్ని మరోసారి పొడిగించే విషయంలో బోర్డు ఆసక్తిగా లేదని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆయన స్థానంలో భారత మాజీ స్టార్ బ్యాటర్, హైదరాబాద్‌కు చెందిన వీవీఎస్ లక్ష్మణ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఆశించిన ఫలితాలు సాధించకపోవడం, రోహిత్ శర్మ భవిష్యత్తుపై కొనసాగిన ఊహాగానాల సమయంలో అగార్కర్ వ్యవహరించిన తీరు బీసీసీఐ పెద్దలను అసంతృప్తికి గురి చేసిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లో ఆయన పొడిగించిన పదవీకాలం ముగిసిన తర్వాత కొత్త చీఫ్ సెలెక్టర్‌ను నియమించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు హెడ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌కు యువ ఆటగాళ్ల అభివృద్ధి, జట్టు నిర్మాణంపై విస్తృత అనుభవం ఉంది. అందుకే సెలక్షన్ కమిటీకి ఆయన నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అంశంపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి ప్రస్తుతం వెలువడుతున్న సమాచారం అంతా మీడియా కథనాల ఆధారంగానే ఉంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

UPI digital payment | UPI వినియోగదారులకు అలర్ట్.. కేంద్రం కొత్త నిర్ణయం ఇదే!

UPI digital payment: దేశంలో డిజిటల్ చెల్లింపులకు వెన్నెముకగా మారిన యూపీఐ (UPI) వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007 సవరణ బిల్లుకు...
- Advertisement -
Chat on WhatsApp