Thursday, July 30, 2026
Chat on WhatsApp
HomeTelanganaTG ICET 2026 results | తెలంగాణ ఐసెట్ 2026 ఫలితాలు విడుదల.. కౌన్సెలింగ్ త్వరలో...

TG ICET 2026 results | తెలంగాణ ఐసెట్ 2026 ఫలితాలు విడుదల.. కౌన్సెలింగ్ త్వరలో ప్రారంభం

-

Chat on WhatsApp

TG ICET 2026 results: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన TG ICET 2026 ఫలితాలు అధికారికంగా వెల్లడయ్యాయి. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఫలితాలను ప్రకటించారు. ఈ ఏడాది నిర్వహించిన ఐసెట్ పరీక్షకు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం హాజరైన అభ్యర్థుల్లో 91.22 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, 46,654 మంది అభ్యర్థులు అర్హత పొందినట్లు అధికారులు వెల్లడించారు.

గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం మెరుగైన ఫలితాలను నమోదు చేయడం విశేషంగా నిలిచింది. ఫలితాల విడుదలతో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సిద్ధమవుతున్న వేలాది మంది విద్యార్థుల్లో ఉత్కంఠకు తెరపడింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఫలితాలు https://icet.tsche.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ పరీక్షను మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (నల్గొండ) రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరఫున కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించింది. మే 13, 14 తేదీల్లో రెండు రోజుల పాటు పరీక్షలు జరిగాయి. అనంతరం ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత తుది ఫలితాలను ప్రకటించారు.

త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్, వెబ్ ఆప్షన్లు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించనున్నారు. ర్యాంక్ ఆధారంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. విద్యార్థులు ర్యాంక్ కార్డును భద్రంగా ఉంచుకోవాలని, అవసరమైన ధ్రువపత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CP Sajjanar Issues Public Advisory Amid Heavy Rains in Hyderabad

CP Sajjanar  | భారీ వర్షాలపై సజ్జనార్ హెచ్చరిక.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు

CP Sajjanar: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని  హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ (CP), వి.సి. సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే...
- Advertisement -
Chat on WhatsApp