Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి పుట్టినరోజును పురస్కరించుకుని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా స్పందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమాల వేదికగా చేసిన ఈ పోస్టులో ఆమె వ్యక్తిత్వం, కుటుంబం పట్ల అంకితభావాన్ని ప్రశంసిస్తూ తన అనుబంధాన్ని వ్యక్తం చేశారు.
భువనేశ్వరి తన కుటుంబ జీవితంలోనే కాకుండా, వివిధ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. భార్యగా, తల్లిగా, వ్యాపార రంగంలోనూ ఆమె చూపిస్తున్న నిబద్ధత కుటుంబ సభ్యులతో పాటు అనేక మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆమె దయ, సానుకూల దృక్పథం, ఇతరులకు చేయూతనిచ్చే స్వభావం ప్రత్యేకమైనవని పేర్కొంటూ, తన జీవితంలో భువనేశ్వరి భాగస్వామిగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
ఆమె బలం, ఆప్యాయత తమ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నాయని తన అని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. భువనేశ్వరి చేపట్టే ప్రతి బాధ్యతలో ప్రత్యేకత కనిపిస్తుందని, ఆమె వల్ల కుటుంబంలో ఆనందం, స్ఫూర్తి నెలకొంటాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఈ కొత్త సంవత్సరం ఆమె జీవితంలో మరింత ఆనందం, విజయాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా, భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చంద్రబాబు చేసిన ఈ సందేశం ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
Nara Bhuvaneswari | ‘మా జీవితాల్లో వెలుగు’.. జీవిత భాగస్వామికి చంద్రబాబు బర్త్‌డే విషెస్
-








