AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేస్తూ, జూలై 1 నుంచి ఆక్వా చెరువులకు యూనిట్ విద్యుత్‌ను కేవలం రూ.1.50కే సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ ఖర్చులు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రంలోని వేలాది మంది ఆక్వా రైతులకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించనుంది. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి రైతులకు ఆర్థికంగా మద్దతు అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆక్వా రంగం హర్షం వ్యక్తం చేస్తోంది.
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో జిల్లా ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు రైతు సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సంఘం నాయకులు ప్రశంసించారు. విద్యుత్ రాయితీతో ఆక్వా రంగానికి కొత్త ఊపు వస్తుందని, రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ALSO READ: Bombay High Court | నితిన్ గడ్కరీపై ఫేక్ ప్రచారం.. అభ్యంతరకర పోస్టులు తొలగించాలని కోర్టు ఆదేశం








