Prabhas Spirit | ప్రభాస్ లుక్ కోసం బ్రేక్.. స్పిరిట్ మూవీపై లేటెస్ట్ అప్‌డేట్

Prabhas starrer Spirit movie shooting faces a temporary break Prabhas starrer Spirit movie shooting faces a temporary break

Prabhas Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి(Sandeep Reddy Vanga) వంగా తెరకెక్కిస్తున్న భారీ సినిమా ‘స్పిరిట్’ ‘Spirit’  షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ పడింది. గత ఏడాది చివర్లో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం నిలిచిపోయినట్లు సమాచారం. తాజా అప్‌డేట్ ప్రకారం తదుపరి షెడ్యూల్ “ఏప్రిల్ చివర్లో లేదా మే నెలలో” ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఈ విరామానికి ప్రధాన కారణం ప్రభాస్ ఇతర సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉండటమే. ప్రస్తుతం ఆయన “‘ఫౌజీ’” సినిమా పనుల్లో పాల్గొంటుండగా, అదే సమయంలో “‘కల్కి 2’”కోసం కూడా కొన్ని రోజులు కేటాయించనున్నారు. అంతేకాదు, ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ తన లుక్‌లో కీలక మార్పులు చేసుకోవాల్సి ఉండటంతో, ఆ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సమయం అవసరమైంది.

ఏప్రిల్–మేలో మళ్లీ షూటింగ్

ఏప్రిల్ లేదా మేలో షూటింగ్ తిరిగి ప్రారంభమైన తర్వాత ఎలాంటి బ్రేకులు లేకుండా వేగంగా పూర్తి చేయాలని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారని సమాచారం. ఇప్పటికే సీన్లు, డేట్స్, లొకేషన్లు ఫిక్స్ చేయడంతో “సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తి” చేయాలన్నది టీమ్ లక్ష్యం. మొత్తం షూటింగ్‌ను కేవలం “95 రోజుల్లో” పూర్తి చేయాలని ప్లాన్ చేయడం విశేషం.

విలన్ పాత్రలో గోపీచంద్?

ఇదిలా ఉండగా, ఈ సినిమాలో విలన్ పాత్రకు సంబంధించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ హీరో “గోపీచంద్”ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

రిలీజ్ డేట్ ఫిక్స్

సినిమా విడుదలపై ఎలాంటి మార్పులు లేవు. ఇప్పటికే ప్రకటించినట్టుగానే “స్పిరిట్” 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ప్రభాస్‌తో పాటు “తృప్తి డిమ్రి, వివేక్ ఓబెరాయ్, ప్రకాశ్ రాజ్” కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు “హర్షవర్ధన్ రమేష్‌వర్” సంగీతం అందిస్తున్నారు. యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలతో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

also read:విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మిస్సింగ్.. హ్యాకింగ్ భయంతో ఫ్యాన్స్ ఆందోళన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *