LIVE
Sunday, November 15, 2026
LIVE
LIVE

India vs Sri Lanka | శ్రీలంకతో తొలి టెస్టుకు అశ్విన్ అంచనా జట్టు.. సర్‌ప్రైజ్‌లు ఇవే

by Bajaswamy
9 views
India vs Sri Lanka

India vs Sri Lanka: శ్రీలంకతో శనివారం గాలే వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా టీమిండియా తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) తన అంచనా ప్లేయింగ్ ఎలెవన్‌ను వెల్లడించాడు. ఇందులో కొన్ని ఊహించని ఎంపికలు ఉన్నాయి. అశ్విన్ అంచనా ప్రకారం యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. సాయి సుదర్శన్ గైర్హాజరీలో దేవదత్ పడిక్కల్ మూడో స్థానంలో, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో ఆడతారు. రిషభ్ పంత్ వికెట్‌కీపర్ బ్యాటర్‌గా ఐదో స్థానంలో, ధ్రువ్ జురెల్ ఆరో స్థానంలో ఉంటాడని అశ్విన్ పేర్కొన్నాడు. దీంతో సర్ఫరాజ్ ఖాన్‌కు మరోసారి నిరాశ ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు.

బౌలింగ్ విభాగంలో రవీంద్ర జడేజా, మానవ్ సుతార్‌తో పాటు కుల్దీప్ యాదవ్‌కు చోటిచ్చాడు. గాలే పిచ్‌పై మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చని అశ్విన్ భావిస్తున్నాడు. అత్యంత ఆసక్తికరమైన ఎంపికగా ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో గుర్నూర్ బ్రార్‌ను ఎంచుకున్నాడు. మహ్మద్ సిరాజ్‌తో కలిసి గుర్నూర్ కొత్త బంతిని పంచుకుంటాడని అంచనా వేశాడు. అశ్విన్ అంచనా జట్టు: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More