Wednesday, July 29, 2026
Chat on WhatsApp
HomeTelanganaCP Sajjanar | ఒక్క క్షణం అజాగ్రత్త ప్రాణాలు తీస్తుంది.. సజ్జనార్ హెచ్చరిక

CP Sajjanar | ఒక్క క్షణం అజాగ్రత్త ప్రాణాలు తీస్తుంది.. సజ్జనార్ హెచ్చరిక

-

Chat on WhatsApp

CP Sajjanar: రోడ్డు భద్రతపై తరచూ అవగాహన కల్పించే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మరోసారి ప్రజలను అప్రమత్తం చేశారు. బైక్‌పై ప్రయాణిస్తూ ఇతర పనుల్లో నిమగ్నమవడం ఎంత ప్రమాదకరమో వివరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.. ప్రతి పనికి ఒక పద్ధతి ఉంటుందని, కానీ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బైక్‌పై ప్రయాణిస్తూ పని చేయడం వంటి చర్యలు తీవ్ర ప్రమాదాలకు దారితీస్తాయని సజ్జనార్ హెచ్చరించారు. అతిగా తొందరపడటం, ఏకాగ్రత కోల్పోవడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

రోడ్డుపై వాహనం నడిపే సమయంలో ఒక్క క్షణం నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకంగా మారవచ్చని ఆయన గుర్తుచేశారు. అలాంటి అజాగ్రత్త వల్ల కేవలం ప్రయాణించే వ్యక్తికే కాకుండా, రోడ్డుపై వెళ్తున్న ఇతర అమాయకుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలిపారు. ఉపాధి కోసం, జీవనోపాధి కోసం చేసే పని మన జీవితాన్నే ప్రమాదంలోకి నెట్టే విధంగా ఉండకూడదని సజ్జనార్ సూచించారు.

రహదారులపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం మానుకుని, ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రయాణంలో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరూ తమ గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకోగలరని సజ్జనార్ పేర్కొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Burj Khalifa Introduces UPI Ticket Booking for Indian Tourists

Burj Khalifa | బుర్జ్ ఖలీఫా సందర్శన ఇక మరింత సులభం.. UPIతో ఆన్‌లైన్...

Burj Khalifa: దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా సందర్శించాలనుకునే భారతీయ పర్యాటకులకు గుడ్‌న్యూస్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా సందర్శన కోసం ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)...
- Advertisement -
Chat on WhatsApp