Wednesday, July 29, 2026
Chat on WhatsApp
HomeInterNationalBurj Khalifa | బుర్జ్ ఖలీఫా సందర్శన ఇక మరింత సులభం.. UPIతో ఆన్‌లైన్ టికెట్...

Burj Khalifa | బుర్జ్ ఖలీఫా సందర్శన ఇక మరింత సులభం.. UPIతో ఆన్‌లైన్ టికెట్ చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్

-

Chat on WhatsApp

Burj Khalifa: దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా సందర్శించాలనుకునే భారతీయ పర్యాటకులకు గుడ్‌న్యూస్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా సందర్శన కోసం ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా ఆన్‌లైన్‌లోనే టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ నిర్ణయంతో యూఏఈలో యూపీఐ ద్వారా ఆన్‌లైన్ టికెట్ చెల్లింపులను అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి ప్రముఖ టూరిస్ట్ డెస్టినేషన్‌గా బుర్జ్ ఖలీఫా గుర్తింపు పొందింది.

ఈ సేవలను NPCI International Payments Limited (NIPL), NEOPAY, Emaar Entertainment భాగస్వామ్యంతో ప్రారంభించారు. ఈ కొత్త విధానం ద్వారా భారతీయులు యూఏఈకి బయలుదేరే ముందే బుర్జ్ ఖలీఫా అధికారిక వెబ్‌సైట్‌లో తమకు ఇష్టమైన యూపీఐ యాప్‌ను ఉపయోగించి టికెట్లు సులభంగా కొనుగోలు చేయవచ్చు. యూఏఈలో ఇప్పటికే 2022 నుంచే క్యూఆర్ కోడ్ ఆధారిత యూపీఐ చెల్లింపులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు అదే సౌకర్యాన్ని ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌కు కూడా విస్తరించడం వల్ల భారతీయ ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలగనుంది.

ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో రితేశ్ శుక్లా మాట్లాడుతూ విదేశాలకు వెళ్లే భారతీయులు తమకు అలవాటైన చెల్లింపు విధానాన్నే ఉపయోగించాలని కోరుకుంటారని, ఈ సేవతో యూఏఈ చేరుకునే ముందే సురక్షితంగా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. గల్ఫ్ దేశాల్లో ఈ-కామర్స్ కోసం యూపీఐ సేవలను ప్రారంభించిన తొలి సంస్థగా నిలవడం గర్వకారణమని నియోపే సీఈవో విభోర్ ముంధాడా పేర్కొన్నారు. ఈమార్ ప్రతినిధుల ప్రకారం, బుర్జ్ ఖలీఫాను సందర్శించే విదేశీ పర్యాటకుల్లో భారతీయులే ప్రధాన వర్గంగా ఉండటంతో, ఈ కొత్త చెల్లింపు విధానం వారి ప్రయాణ అనుభవాన్ని మరింత సులభతరం చేయనుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

BMW Offers Voluntary Retirement to 40,000 Employees Amid Global Cost-Cutting

BMW | లాభాలు తగ్గడంతో BMW కఠిన నిర్ణయం.. వేల ఉద్యోగాలకు గుడ్‌బై

ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజం BMW కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న వ్యయాలు, చైనా మార్కెట్‌లో అమ్మకాలు పడిపోవడం, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో లాభాలు తగ్గడంతో జర్మనీలో వేలాది మంది ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ...
- Advertisement -
Chat on WhatsApp