Monday, July 20, 2026
Chat on WhatsApp
HomeNationalWomen Reservation Bill | 326 ఓట్లు అవసరం.. కానీ 278కే పరిమితం.. నిలిచిపోయిన మహిళా...

Women Reservation Bill | 326 ఓట్లు అవసరం.. కానీ 278కే పరిమితం.. నిలిచిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు

-

Chat on WhatsApp

Women Reservation Bill: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు షాక్ తగిలింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ కీలక బిల్లు ఓటింగ్‌లో ఆమోదం పొందకపోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. డీలిమిటేషన్‌తో పాటు వచ్చిన ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నప్పటికీ, చివరికి ఇది అవసరమైన మెజారిటీ సాధించలేకపోయింది.

ఓటింగ్ ప్రక్రియలో మొత్తం 489 మంది సభ్యులు పాల్గొన్నారు. బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం రెండు మూడొంతుల మెజారిటీ, అంటే 326 ఓట్లు అవసరం. అయితే అధికార కూటమికి కేవలం 278 ఓట్లు మాత్రమే రావడంతో, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకుండా నిలిచిపోయింది.

మెజారిటీ లేకపోవడంతో బిల్లు విఫలం

అధికార కూటమి బలం 293గా ఉన్నప్పటికీ, ఓటింగ్ సమయంలో 278 ఓట్లు మాత్రమే నమోదు కావడం గమనార్హం. అంటే సుమారు 15 మంది సభ్యులు గైర్హాజరు కావడం లేదా విభిన్నంగా ఓటు వేయడం వల్లే బిల్లుకు నష్టం జరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ అంశం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది.

డీలిమిటేషన్‌తో లింక్ ప్రభావం?

మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపెట్టడం కూడా ఈ ఫలితంపై ప్రభావం చూపినట్టు విశ్లేషణలు వస్తున్నాయి. కొంతమంది సభ్యులు ఈ రెండు అంశాలను కలిపి తీసుకురావడాన్ని వ్యతిరేకించినట్లు సమాచారం.

రాజకీయ ప్రభావం ఎలా?

కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ బిల్లు విఫలమవడంతో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా సాధికారతకు ఇది వెనుకడుగు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు, భవిష్యత్తులో సవరణలతో మళ్లీ ఈ బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Ebola outbreak in Congo

Congo Ebola | ఎబోలా ఎఫెక్ట్.. కాంగోలో రోజురోజుకూ పెరుగుతున్న మరణాలు

మధ్య ఆఫ్రికాలోని కాంగోను ఎబోలా(Congo Ebola) వైరస్ మరోసారి వణికిస్తోంది. కేసులు, మరణాలు పెరుగుతుండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.మే 15 తర్వాత కాంగోలో ఎబోలా కేసులు క్రమంగా పెరుగుతూ, మొత్తం బాధితుల సంఖ్య...
- Advertisement -
Chat on WhatsApp