LIVE
Monday, November 23, 2026
LIVE
LIVE

Pawan Kalyan | సర్జరీ తర్వాత ఏపీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. జోష్ లో జనసేన శ్రేణులు

by Bajaswamy
13 views
Pawan Kalyan receives a grand welcome at Gannavaram Airport after surgery

Pawan Kalyan: భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు గన్నవరం విమానాశ్రయంలో జనసేన నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అభిమానుల అభివాదాలను స్వీకరించిన ఆయన అక్కడి నుంచి నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి బయలుదేరారు. పార్టీ కార్యాలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కొద్దిసేపట్లో అధికారులతో పాటు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ప్రభుత్వ కార్యక్రమాల పురోగతి, శాఖల పనితీరు, పార్టీ సంస్థాగత వ్యవహారాలతో పాటు రానున్న రాజకీయ కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. శస్త్రచికిత్స అనంతరం పవన్ కళ్యాణ్ తొలిసారిగా రాష్ట్రానికి రావడంతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More