LIVE
Sunday, November 22, 2026
LIVE
LIVE

Mahesh Babu | “ఎప్పటికీ నా లిటిల్ స్టార్‌వే”.. సితారకు స్పెషల్ బర్త్‌డే విషెస్!

by Bajaswamy
1 views
Mahesh Babu with daughter Sitara Ghattamaneni on her birthday

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని 14వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టుతో అభిమానుల మనసు దోచుకున్నారు. సితారతో కలిసి దిగిన ఓ అందమైన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న మహేష్, తన కూతురిపై ఉన్న ప్రేమను హృదయాన్ని హత్తుకునేలా వ్యక్తం చేశారు. కూతురిపై ఉన్న అపారమైన ప్రేమను వ్యక్తం చేస్తూ, “నువ్వు ఎంత ఎదిగినా నాకు మాత్రం ఎప్పటికీ నా లిటిల్ స్టార్‌వే. హ్యాపీ బర్త్‌డే సితార. నీ జీవితంలో సంతోషాలు, విజయాలు ఎల్లప్పుడూ ఉండలని కోరుకుంటున్నా. లవ్ యూ ఆల్వేస్” అని మహేష్ బాబు రాశారు.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుండగా, అభిమానులు, సినీ ప్రముఖులు సితారకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు ఆమె తల్లి నమ్రతా శిరోద్కర్ కూడా ప్రత్యేక పోస్టుతో కూతురికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. “మా జీవితాలను ప్రేమ, ఆనందంతో నింపిన నా బంగారు కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ ఎదుగుదలను చూడటం మా అదృష్టం. నీ జీవితంలో ఎల్లప్పుడూ సంతోషం, విజయాలు ఉండాలని కోరుకుంటున్నా” అంటూ నమ్రతా తన మాతృస్నేహాన్ని పంచుకున్నారు. మహేష్, నమ్రతా చేసిన పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More