Brave Boy: ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరి(Lakhimpur Kheri)లో ఓ 13 ఏళ్ల బాలుడు(13-year-old-boy) చూపించిన ధైర్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన ఇంటిని బంధువులు ఆక్రమించారని న్యాయం కోసం ఏకంగా జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించాడు. సాధారణంగా పెద్దలు కూడా అధికారుల ముందు సమస్యలు చెప్పేందుకు వెనుకాడే పరిస్థితుల్లో, చిన్న వయసులోనే బాలుడు ధైర్యంగా తన సమస్యను వివరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫిర్యాదు సమయంలో బాలుడు తనకు న్యాయం జరగాలంటే డబ్బులు లేదా కమీషన్ ఇవ్వాల్సిందేనా అంటూ పోలీసులను ప్రశ్నించాడు.

అతని ప్రశ్నతో అక్కడున్న అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. తన ఇంటిని తిరిగి ఇప్పించాలని, ఆక్రమణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరాడు. బాలుడి పరిస్థితిని గమనించిన కలెక్టర్ వెంటనే స్పందించి, సమస్యను పరిశీలించి పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. చిన్న వయసులోనే అన్యాయాన్ని ఎదురించి, తన హక్కుల కోసం పోరాడిన బాలుడి ధైర్యానికి పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. సమస్యను చెప్పే తీరు, అధికారులను ప్రశ్నించిన విధానం చూసి నెటిజన్లు బాలుడి ఆత్మవిశ్వాసాన్ని అభినందిస్తున్నారు.
ALSO READ: Thalli Bidda Express | తల్లీబిడ్డలకు సీఎం గిఫ్ట్.. రంగంలోకి 500 కొత్త వాహనాలు
