Friday, July 31, 2026
Chat on WhatsApp
HomeUncategorizedTrump OPT fee | అమెరికాలో చదివే విద్యార్థులకు ట్రంప్ షాక్?.. OPTపై ట్రంప్ ప్రభుత్వం కఠిన నిర్ణయం?

Trump OPT fee | అమెరికాలో చదివే విద్యార్థులకు ట్రంప్ షాక్?.. OPTపై ట్రంప్ ప్రభుత్వం కఠిన నిర్ణయం?

-

Chat on WhatsApp

Trump OPT fee: అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) కింద ఉద్యోగం చేయాలంటే ఏకంగా లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వేలాది మంది భారతీయ విద్యార్థుల అమెరికా కలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు OPT ద్వారా కొంతకాలం ఉద్యోగం చేసే అవకాశం పొందుతున్నారు.

అయితే ట్రంప్ ప్రభుత్వం “అమెరికన్ ఫస్ట్” విధానంలో భాగంగా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు విదేశీయుల ఉద్యోగ అవకాశాలను కట్టడి చేసే చర్యలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే OPT విధానంలో భారీ మార్పులతో పాటు అధిక ఫీజు ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే భారీ విద్యా రుణాలు తీసుకుని అమెరికాకు వెళ్లిన వేలాది మంది భారతీయ విద్యార్థులు ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేళ ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే అమెరికాలో ఉద్యోగం చేసి కెరీర్ ప్రారంభించాలనే విదేశీ విద్యార్థుల కల మరింత ఖరీదైనదిగా మారే అవకాశం ఉంది. అయితే ఈ ప్రతిపాదనపై అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి ఇది అమల్లోకి వస్తుందా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో హెచ్-1బీ వీసా విధానంలోనూ మార్పులు తీసుకురావాలని ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp