Friday, July 31, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTSrinivasa Mangapuram OTT | జయకృష్ణ తొలి సినిమాకు ఓటీటీ క్రేజ్.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

Srinivasa Mangapuram OTT | జయకృష్ణ తొలి సినిమాకు ఓటీటీ క్రేజ్.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

-

Chat on WhatsApp

Srinivasa Mangapuram OTT: తెలుగు చిత్రసీమలో ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమైన తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ జూలై 30న థియేటర్లలో విడుదలైంది. విడుదలకు ముందే మంచి అంచనాలు నెలకొన్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించగా, ఇప్పుడు దాని ఓటీటీ విడుదలపై కూడా చర్చ సాగుతోంది.

‘ఆర్‌ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ సినిమా రస్టిక్ లవ్ అండ్ రివేంజ్ డ్రామాగా రూపొందింది. తిరుపతి నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ కథానాయికగా టాలీవుడ్‌కు పరిచయమైంది. అలాగే కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ప్రతినాయకుడి పాత్రలో నటించగా, శ్యామ్, బ్రహ్మాజీ, నరేష్ విజయకృష్ణ కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. సినిమా విడుదల రోజునే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సాధారణంగా థియేటర్లలో నాలుగు వారాల ప్రదర్శన అనంతరం సినిమాలు ఓటీటీలోకి వస్తుండటంతో, ఆగస్టు చివరి వారంలో లేదా ఆగస్టు 28 ప్రాంతంలో ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే అధికారిక స్ట్రీమింగ్ తేదీని ఓటీటీ సంస్థ ఇంకా ప్రకటించలేదు.

‘చందమామ కథలు’ పిక్చర్స్ బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. జయకృష్ణ తొలి చిత్రంలోనే యాక్షన్, డ్యాన్స్‌లతో ఆకట్టుకోవడంతో పాటు, ఘట్టమనేని కుటుంబ వారసుడిగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతున్నాడు. విడుదలకు ముందే డిజిటల్ హక్కులు మంచి ధరకు అమ్ముడవడంతో నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్స్ కూడా లభించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Trump Administration Considers $100,000 OPT Fee for International Students

Trump OPT fee | అమెరికాలో చదివే విద్యార్థులకు ట్రంప్ షాక్?.. OPTపై ట్రంప్ ప్రభుత్వం కఠిన నిర్ణయం?

Trump OPT fee: అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) కింద...
- Advertisement -
Chat on WhatsApp